తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ కు స్వర్ణ పతకం

బర్మింగ్ హాంలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో, మహిళల బాక్సింగ్ ఫైనల్లో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ స్వర్ణ పతకం సాధించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జరీన్ కు శుభాకాంక్షలు తెలిపిన సిఎం, ఆమె విజయపరంపరను అభినందించారు.

జరీన్ గెలుపుతో తెలంగాణ కీర్తి మరోసారి విశ్వవ్యాపితమైందని సిఎం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను నిరంతరం ప్రోత్సహిస్తూనే వుంటుందని సిఎం పునరుద్ఘాటించారు. నిఖత్ జరీన్ తో సిఎం కెసిఆర్ స్వయంగా ఫోన్లో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.

Related Articles

Most Populer

Recent Posts