- Advertisement -

వెన్నుపోటులో తండ్రిని మించిన‌ త‌న‌యుడు అనిపించుకున్న‌ లోకేష్‌..?

- Advertisement -

వెన్నుపోటు ప‌దానికి నిలువెత్తు నిద‌ర్శ‌నం ఎవ‌రు అని చ‌ర్చించుకుంటే ముందుగా వ‌చ్చేది చంద్ర‌బాబు. న‌మ్మిన వారికి న‌మ్మించి వెన్నుపోటు పొడ‌వ‌డంలో బాబుకు ఉన్న ఇమేజ్ ఎలాంటిదో అంద‌రికీ తెలిసిందే. ఎన్టీఆర్ వెన్నుపోటు నుంచి ఎంతో మంది బాబు వెన్న‌పోటుకి ఎంతో బ‌ల‌య్యార‌నే విమ‌ర్శ‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

బాబు వెన్న‌పోటుకు ఇప్పుడు జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాన్ బ‌ల‌య్యాడు. ప‌వ‌న్ తాజాగా పెట్టిన వెన్నుపోటు ట్వీట్‌లే ఇందుకు సాక్ష్యం. గత ఎన్నికల సమయంలో తను తెలుగుదేశం పార్టీకి అండగా నిలిస్తే, ఇప్పుడు తనపై చంద్రబాబు తనయుడు తీవ్రమైన కుట్రలకు పాల్పడ్డాడు అని పవన్ కల్యాణ్ ట్విటర్ వేదికగా ఆరోపించడం ఆసక్తిదాయకంగా మారింది.

అయితే ప‌వ‌న్‌కు వెన్నుపోటు పొడిచింది చిన‌బాబు లోకేష్ అని ప‌వ‌న్ స్ప‌ష్టంగా చెప్పారు. ఏపీ సచివాలయంలోనే లోకేష్, కొన్ని మీడియా సంస్థల ప్రతినిధులు, లోకేష్ స్నేహితులు కలిసి తనపై కుట్ర పన్నారని, పది కోట్ల రూపాయల ఖర్చుతో తనపై బురదజల్లే ప్రాజెక్టును నడిపించారని పవన్ కల్యాణ్ పేర్కొనడం విశేషం.

నేడు జరుగుతున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దీక్షకు తన మద్దతు కోరడం దగ్గర నుంచి పవన్ కల్యాణ్ ఈ వ్యవహారంపై స్పందించాడు. గ‌తంలో మీకు స‌పోర్ట్‌గా చేస్తే మీరు నాకేమి ఇచ్చారు. టీవీ 9రవి ప్రకాష్, టీవీ 9శ్రీనిరాజు, రామ్ గోపాల్ వర్మ అనే సినీ దర్శకుడు.. వీళ్లతో పాటు నారా లోకేష్, అతడి స్నేహితుడు కిలారు రాజేష్‌లు ఆరు నెలల నుంచి తనపై కుట్ర చేసినట్టుగా పవన్ కల్యాణ్ పేర్కొన్నాడు.

లోకేష్ ఆధ్వర్యంలోనే ఈ కుట్ర జరిగిందని వివరిస్తున్నాడు. కత్తి మహేశ్ రెచ్చిపోయిన తీరును చూసిన వారైనా, శ్రీ రెడ్డి అకృత్యాలను చూసిన వారైనా.. వీళ్ల వెనుక ఎవరున్నారు? అనే అంశం మొదటి నుంచి చర్చలో నిలిచింది. వెన్నుపోటు పొడ‌వ‌డంలో తండ్రినే మించిపోయాడు లోకేష్ అని రాజ‌కీయ వ‌ర్గాలు అంటున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -