తెరవెనుక ఎవరు నడిపిస్తున్నారో తెలియదు కానీ బాలయ్య-ఎన్టీఆర్‌ల మధ్య దూరం మాత్రం పెరుగుతూనే ఉంది. ఆ మధ్య కాలంలో బాలయ్యతో కలిసిపోవాలని ఎన్టీఆర్ చాలా ప్రయత్నాలే చేశారు. బాలయ్య కూడా ఎన్టీఆర్‌తో కలవడానికి సుముఖత వ్యక్తం చేశాడు కూడా. అయితే ఇంతలోనే నారావారి రాజకీయం దెబ్బకు ఎన్టీఆర్‌ని పూర్తిగా దూరం పెట్టేశాడు బాలయ్య. 2009 ఎన్నికల సమయం నాటికి నందమూరి కుటుంబానికి పూర్తిగా దగ్గరైన ఎన్టీఆర్ ఆ తర్వాత మాత్రం లోకేష్‌కి ఎక్కడ పోటీ అవుతాడో అన్న చంద్రబాబు భయపడడంతోనే ఎన్టీఆర్‌ని పూర్తిగా నందమూరి కుటుంబానికి దూరం చేసే వ్యూహం, కుట్రలు మొదలయ్యాయి.
చంద్రబాబు మాటలు నమ్మి తండ్రికే ద్రోహం చేస్తూ, వెన్నుపోటు ఎపిసోడ్లో బాబుకు మద్దతిచ్చిన బాలయ్య ఇప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్‌కి ద్రోహం చేస్తూ లోకేష్‌కే జై కొట్టాడు. అయితే బాలయ్యతో సయోధ్య కోసం ఎన్టీఆర్ ప్రయత్నాలు చేస్తున్న ప్రతిసారీ నారా వారి కుట్రల పుణ్యమాని దూరం పెరుగుతూనే ఉందని తెలుస్తోంది. తాజాగా జన్మలో ఎప్పుడూ తెరపై ఎన్టీఆర్‌లా కనిపించనని, కనిపించలేనని……. ఆ మహానటుడి పాత్ర పోషించే ధైర్యం తనకు లేదని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. ఇవే మాటలను కొన్ని రాజకీయ శక్తులు బాలయ్యకు మరో అర్థంలో చెప్పాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్‌లో నటిస్తున్న బాలయ్యకు ఎన్టీఆర్ వార్నింగ్ ఇచ్చినట్టుగా ఎన్టీఆర్ మాటలను మార్చి చెప్పారు. అసలే ఆవేశం మాత్రమే ఎక్కువ స్థాయిలో ఉండే బాలయ్య ఆ వెంటనే ఎన్టీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడని తెలుస్తోంది. అతి త్వరలో ఇదే విషయంపై తన మాటలు బాలయ్య బాబాయ్‌ని ఉద్ధేశించి కాదని ఎన్టీఆర్ చెప్పడంలాంటిది చెయ్యకపోతే బాలయ్యనే ఎన్టీఆర్‌ని తిట్టడం కోసం ప్రెస్ మీట్ పెడతానన్నాడట. ముందు ముందు ఈ వివాదం ఇంకా ఎంత దూరం వెళ్తుందో చూడాలి మరి.
