- Advertisement -
సావిత్రి జీవిత కథను సినిమాను మహనటిగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. సావిత్రి పాత్రను హీరోయిన్ కీర్తీ సురేష్ చేసింది.సినిమా గత శుక్రవారం విడుదలైంది.బాక్సాఫీస్ దగ్గర సినిమా సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతుంది. సినిమా కలెక్షన్లు కూడా రోజు రోజుకి పెరిగుతున్నాయి.తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా తొలి రోజున 1.42 కోట్లను వసూలు చేసింది. తొలిరోజున ఒక్క నైజామ్ లోనే ఈ సినిమా 66 లక్షలు రాబట్టడం విశేషం.
ఇక అమెరికాలో ‘నా పేరు సూర్య’ తొలిరోజు వసూళ్లను ‘మహానటి’ అధిగమించడం ఆశ్చర్యం. సావిత్రి జీవితంలో చోటుచేసుకున్న సంఘటనలు బాగా చూపించడంతో సినిమాపై పాజిటీవ్ రెస్పన్స్ వస్తుంది.మంచి క్రేజ్ ఉన్న నటీనటులను తీసుకొవడం వల్లన సినిమాపై అంచనాలు పెంచే విధాంగా చేశాయి.
