ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎక్కడ చూసిన ఆర్ఎక్స్ 100 సినిమా గురించే చర్ఛ.ఎటువంటి అంచనాలు లేకుండ వచ్చిన ఈ సినిమా టాలీవుడ్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. కొత్త నటీనటులతో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది.అయితే ఈ సినిమాకు ఇంతటి క్రేజ్ రావడానికి కారణం సినిమా హీరోయిన్ రాజ్‌పుత్ పాయల్.సినిమా ట్రైలర్‌లో ఆమె చూపించిన అందాలకు ఫిదా అయిన ప్రేక్షకులు థియోటర్స్‌కు క్యూ కట్టారు.ఇక సినిమాలో ఆమె అందంతో పాటు నటనకు కూడా విమర్శకుల ప్రసంశలు అందాయి.దీంతో ఆమెకు వరస సినిమాలలో అవకాశాలు వస్తున్నాయి.తాజాగా ఈమె టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాలో చాన్స్ కొట్టేసిందని వార్తలు వినబడుతున్నాయి.
మహేశ్ ప్రస్తుతం తన 25వ సినిమాలో బిజీగా ఉన్నాడు.ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమాలో మహేశ్‌కు జోడిగా పూజా హెగ్డె నటిస్తుంది.ఈ సినిమా తరువాత మహేశ్ సుకుమార్ దర్శకత్వం సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా రాజ్‌పుత్ పాయల్‌ను తీసుకున్నారని సమాచారం.ఆర్స్ఎక్స్ 100 మూవీ చూసిన సుకుమార్ ఆమె నటన చూసి తన సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు తెలుస్తుంది.హీరోయిన్ ఎంపికపై మహేశ్ కూడా ఆనందం వ్యక్తం చేశాడని సమాచారం.మరి ఇది కనుక నిజం అయితే రాజ్‌పుత్ పాయల్ దశ తిరిగినట్లే.దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
