- Advertisement -

యూట‌ర్న్ తీసుకున్న వైసీపీ…డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నిక‌కు దూరం

- Advertisement -

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ షాకిచ్చింది. నిన్నటివరకూ విపక్షాల అభ్యర్థికి మద్దతిస్తామని చెప్పిన ఆ పార్టీ, నేడు అనూహ్యంగా తన మనసు మార్చుకుంది. ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నామని, ఓటింగ్ ను బాయ్ కాట్ చేస్తున్నామని ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు.

మొద‌ట‌రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధికి వ్యతిరేకంగా ఓటు చేయాలని వైసీపీ నిర్ణయం తీసుకొంది. అయితే కాంగ్రెస్ పార్టీ కూడ విపక్షాల తరుపున సొంత పార్టీనుంచి అభ్యర్థిని బరిలోకి దింపింది. దీంతో వైసీపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులకు ఓటు వేయకూడదని వైసీపీ నిర్ణయం తీసుకొంది.

అయితే యూపీఏ ఉనికి లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న విపక్షాల అభ్యర్ధి బరిలో ఉంటే తాము మద్దతిచ్చేవారమని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఏపీకి కాంగ్రెస్, బీజేపీలు నష్టం చేశాయని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చెప్పారు. ఈ కారణంగానే తాము రాజ్యసభ డిప్యూటీ ఎన్నికల్లో ఓటింగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు.ఇదే సమయంలో రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీకి సైతం తాము మద్దతు ఇవ్వబోవడం లేదని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -