వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై గురువారం హత్యాయత్నం జరిగింది.విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్‌పై దాడి జరిగింది. విమానాశ్రయం లాంజ్ లో కూర్చుని ఉండగా ఆయనపై గుర్తుతెలియని వ్యక్తి దాడి చేశాడు.జగన్‌పై దాడిని ఖండించారు నటడు జనసేన అధినేత పవన్ కల్యాణ్.ఓ ప్రజాస్వామ్యం దేశంలో ప్రతిపక్షనేతకే రక్షణ లేదంటే రాష్ట్రంలో ఎలాంటి పాలన సాగుతుందో ప్రజలు అర్థం చేసుకోవాలి అని పవన్ చెప్పారు.జగన్‌పై దాడి ప్రభుత్వ వైఫల్యంగా వర్ణించారు పవన్.
వైఎస్ జగన్‌పై దాడిని రాజకీయలకు అతీతంగా చూడలని పవన్ కోరారు.ప్రభుత్వం ఇకనైనా శాంతి భద్రతలను సరి చేసుకోవాలని హితవు పలికారు పవన్. హైదరాబాదు రావడానికి జగన్ విశాఖ విమానాశ్రయానికి వచ్చారు. ఈ సమయంలో ఆయనపై దాడి జరిగింది.జగన్ ఎడమ భుజంపై స్వల్పంగా గాయమైంది. ప్రథమ చికిత్స తీసుకున్న జగన్ వెంటనే హైదరాబాద్ బయలు దేరారు.
