టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు #మీటూ ఉద్యమం సంచనలం సృష్టించిన సంగతి తెలిసిందే.ఇప్పుడిప్పుడే ఈ గొడవ కాస్తా సర్థుమణింగింది అనుకుంటే మళ్లీ ఎవరో ఒకరు దీనిపై కామెంట్స్ చేస్తు వార్తల్లో నిలిస్తున్నారు.టెన్నిస్ క్రీడాకారుడు మహేష్ భూపతి హీరోయిన్ లారా దత్తని ప్రేమించి పెళ్లి చేసుకున్నా సంగతి తెలిసిందే.తాజాగా మహేష్ భూపతి #మీటూ గురించి మాట్లాడుడు..సాజిద్ ఎలాంటి వాడో తన భార్య ముందే తనకు చెప్పిందని అన్నాడు. ముంబైలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మహేష్ భూపతి ఈ రకమైన కామెంట్స్ చేశారు.
”నేను లారా దత్తాతో డేటింగ్ లో ఉన్నప్పుడు ఆమె ‘హౌస్ ఫుల్’ సినిమాలో నటిస్తోంది. ఆ సమయంలో మేం లండన్ లో ఉన్నాం. ఇంటికి రాగానే సాజిద్ గురించి లారా తన స్నేహితురాలితో చెప్పడం నేను విన్నాను.సెట్ లోని ఓ నటి పట్ల సాజిద్ అసభ్యకరంగా ప్రవర్తించాడని చెప్పింది. ఆ సినిమాలో అక్షయ్ కుమార్, రితేష్ దేశ్ ముఖ్, దీపిక పదుకొన్ వంటి తారలు ఉన్నారు. లారా దత్తా చెప్పిందంతా నేను విన్నాను. ఇంత జరుగుతున్నా సెట్ లో నలుగురు స్టార్లు ఉన్నప్పటికీ సదరు నటిని కాపాడలేకపోయారని లారాతో అన్నానని తెలిపాడు.
