పూరిజగన్నాథ్ తెలుగు ఇండస్ట్రీలో హీరోలకి ఓ మ్యానరిజం క్రియేట్ చేసిన దర్శకుడు. తక్కువ బడ్జెట్‌తో పాటు తక్కువ రోజులలో సినిమాలు తీసి చూపించిన దర్శకుడు పూరిజగన్నాథ్. అలాంటి దర్శకుడు చేతిలో ఇప్పుడు ఒక్క సినిమా కూడా లేదు. మహేశ్ బాబు,ఎన్టీఆర్ పవన్ కల్యాణ్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసిన పూరి ఇప్పుడు సినిమాల కోసం హీరోల చూట్టు తిరుగుతున్నాడు. పూరి జగన్నాథ్‌కు చాలకాలంగా సరైన హిట్ లేదు. కొడుకుతో తీసిన సినిమా ఘోరంగా ఫెయిల్ కావడంతో పూరితో సినిమాలు చేయడానికి హీరోలు భయపడుతున్నారు.
తాజాగా పూరి టాలీవుడ్ సన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో సినిమా ప్లాన్ చేస్తున్నాడట. ఆ క్రమంలోనే విజయ్ తో పూరి భేటీ అయ్యారని ఇటీవల వార్తలొచ్చాయి. అయితే విజయ్ దేవరకొండ సీన్ వేరేగా ఉంది. ప్రస్తుతం వరుస కమిట్ మెంట్ లతో బిజీగా వున్నాడు. తన మామ భాగస్వామ్యంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న డియర్ కామ్రేడ్లో నటిస్తున్న విజయ్ ఆ సినిమా తరువాత మరిన్ని కమిట్ మెంట్ లు ఇచ్చాడట. అవన్నీ ఎప్పుడు పూర్తవ్వాలి? ఎప్పుడు పూరీకి డేట్లివ్వాలి.. పూరి ఆశ నెరవేరే ఛాన్సుందా? అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలే ప్లాప్‌లలో ఉన్న పూరితో విజయ్ దేవరకొండ సినిమా చేస్తాడా అనేది డౌటే.
- దళిత స్పీకర్ దూషణ, ఎర్రవల్లి ఘటనలపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం!
- NZ VS INS: హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న మ్యాచ్ టికెట్లు!
- అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత.. బీఆర్ఎస్ సభ్యులంతా సస్పెండ్!
- యువతపై కేసులా? చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ ఆగ్రహం!
- బిగ్‌బాష్ లీగ్ పై ఐపీఎల్ ఓనర్ల కన్ను!
