రష్మిక మందన్న మరియు విజయ్ దేవరకొండ ఈ రోజు ఉదయ్‌పూర్‌లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. “విరోష్” (VIROSH) పేరుతో తమ వివాహాన్ని అభిమానులకు అంకితం చేసిన ఈ జంట, రెండు సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్నారు. ఉదయం 10:10 గంటలకు తెలుగు సంప్రదాయంలో వివాహం జరగగా, సాయంత్రం 4 గంటలకు రష్మిక కుటుంబ సంప్రదాయమైన కొడవ (Kodava) ఆచారాల ప్రకారం మరో కార్యక్రమం నిర్వహించనున్నారు.
వివాహానికి ముందు జరిగిన వేడుకల సందర్భంగా హోటల్ ప్రాంగణంలో స్నేహితులతో కలిసి క్రికెట్ మ్యాచ్ ఆడుతూ “విరోష్ ప్రీమియర్ లీగ్” అని పేరు పెట్టారు. రష్మిక పింక్ ట్యులిప్స్, తెల్ల పువ్వులతో అలంకరించిన డిన్నర్ టేబుల్ ఫొటోలను కూడా షేర్ చేశారు.
తెలుగు వివాహం పూర్తైన తర్వాత వేడుక స్థలానికి బయట వేచి ఉన్న పాపరాజీకి స్వీట్లు పంపించి కృతజ్ఞతలు తెలిపారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుక ఉదయ్‌పూర్‌లోని హోటల్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. గీత గోవిందం , ‘డియర్ కామ్రేడ్’ చిత్రాల్లో కలిసి నటించిన వీరు గత ఏడు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారని, ఇటీవలే తమ సంబంధాన్ని అధికారికంగా ప్రకటించారు.
