Saturday, May 4, 2024
- Advertisement -

ఏపీకీ పెనుముప్పుగా మారి పెథాయ్ తుఫాన్‌..

- Advertisement -

తిత్లీ బీభత్సాన్ని మరకవముందే..ఏపీకి మరో పెను ముప్పు మంచుకొస్తోంది. కోస్తాంధ్రను ముంచెత్తేందుకు పెథాయ్ దూసుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం..మరో 12 గంటల్లో తుఫాన్‌గా బలపడనుంది. దీంతో కోస్తా జిల్లాల‌పై త‌న ప్ర‌భావాన్ని చూప‌నుంది.

మచిలీపట్నానికి ఆగ్నేయంగా 1090 కిమీ, చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 930 కిమీ దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 24 గంటల్లో వాయుగుండం మరింత బలపడి రేపు ఉదయంలోగా ‘పెథాయ్‌’ తుఫానుగా మారే అవకాశం ఉందని, తుఫాను మరింత బలపడి ఈ నెల 16 సాయింత్రం తీవ్ర తుఫానుగా మారనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. కోస్తా జిల్లాలో అధికారులు అన్ని ఓడ‌రేవుల్లో ఒక‌టో ప్ర‌మాద హెచ్చ‌రిక‌ను జారీ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -