అక్కినేని నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన సుమంత్ ఎందుకనో అనుకున్నంత సక్సెస్ కాలేదు. సత్యం,గోదావరి,వంటి సినిమాలు తప్ప సుమంత్‌కు కెరీర్‌కు ఉపయోగపడే సినిమాలు ఏవీ రాలేదు.దీంతో కొంతకాలం గ్యాప్ తీసుకున్న సుమంత్, ఇటీవలే తన సెంకడ్ ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టాడు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటు సినిమాలు తీస్తున్నాడు సుమంత్. ‘మళ్లీ రావా’ అంటూ క్యూట్ లవ్‌స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి డిసెంట్ హిట్ కొట్టాడు. ‘సుబ్రమణ్యపురం’ సినిమాతో పలకరించిన నుమంత్ ,తాజాగా తన మరో సినిమాను విడుదలకు రెడీ చేశాడు.
సుమంత్ నటించిన ‘ఇదం జగత్’ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్. ఒక రిపోర్టర్ సైలెంట్ గా ఉన్నాడంటే దాని అర్థం .. వాడు మనకి దగ్గరగా వచ్చేశాడని అనే డైలాగ్ తో ఈ ట్రైలర్ మొదలవుతోంది. యాక్షన్ .. ఎమోషన్ .. సస్పెన్స్ తో కూడిన సన్నివేశాలపై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. సినిమాపై ఆసక్తిని పెంచేదిగానే ఈ ట్రైలర్ ఉంది. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ ఇస్తుందనే నమ్మకంతో ఉన్నాడు సుమంత్. మరి ట్రైలర్‌తో మెప్పించిన సుమంత్ సినిమాతో మెప్పిస్తాడో లేదో చూడాలి.
- దళిత స్పీకర్ దూషణ, ఎర్రవల్లి ఘటనలపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం!
- NZ VS INS: హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న మ్యాచ్ టికెట్లు!
- అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత.. బీఆర్ఎస్ సభ్యులంతా సస్పెండ్!
- యువతపై కేసులా? చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ ఆగ్రహం!
- బిగ్‌బాష్ లీగ్ పై ఐపీఎల్ ఓనర్ల కన్ను!
