తమిళనాడు ప్రజల అభిమానం ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే. వారికి ప్రాంతీయ అభిమానం చాలా ఎక్కవ. ఒకరని అభిమానించడం మొదలుపెడితే చచ్చే వరకు వారి మీద అభిమానం పెంచుకుంటునే ఉంటారు. ఇక ఈ విషయంలో సినీ హీరోల అభిమానులు అయితే ఓ మెట్టుపైనే ఉంటారు. ఇప్పుడు ఈ అభిమానం ప్రాణాలు తీసుకునే వరకు వరకు చేరింది.
తమిళనాడు స్టార్ హీరోలైన రజినీకాంత్ , ‘పేట’ ,అజిత్ ‘విశ్వాసం’ చిత్రాలు సంక్రాంతి కానుకగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. థియోటర్ల దగ్గర హీరోల అభిమానులు హల్ చల్ చేశారు. రెండు సినిమాలు ఒకే రోజు విడుదల కావడంతో అభిమానులు అధిపత్యం కోసం ప్రయత్నించారు.ఈ సందర్భంగా జరిగిన గొడవ తారా స్థాయికి చేరుకుంది. థియేటర్ల వద్ద అభిమానులు హంగామా సృష్టించారు.తమ హీరో గొప్ప అంటే ,తమ హీరో గొప్ప అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రెండు వర్గాల వారు ఒకరిని ఒకరు రెచ్చగొట్టుకున్నారు.
వేలూరులోని ఓ థియేటర్ అభిమానులు కత్తులతో ,కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో పలువురికి గాయాలు అయినట్లు తెలుస్తోంది.స్టార్ హీరోల సినిమాలు ఒకే రోజు విడుదలైతే పరిస్థితి ఎలా ఉంటోందో తమిళ తంబిలకు తెలిసోచ్చింది అయిన హీరోలు బాగానే ఉంటారు,మధ్యలో ఈ ఫ్యాన్స్‌కు వచ్చిన నొప్పి ఏంటో ఎవ్వరికి అర్ధం కావడం లేదు. అభిమానం హద్దులలో ఉంటే ఎవరికైన బాగానే ఉంటోంది. అభిమానం హద్దులు దాటితే ఇదిగో ఇలా ఉంటోందని చెప్పడానికి ఇది ఓ నిదర్శనం అని చెప్పవచ్చు.
- దళిత స్పీకర్ దూషణ, ఎర్రవల్లి ఘటనలపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం!
- NZ VS INS: హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న మ్యాచ్ టికెట్లు!
- అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత.. బీఆర్ఎస్ సభ్యులంతా సస్పెండ్!
- యువతపై కేసులా? చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ ఆగ్రహం!
- బిగ్‌బాష్ లీగ్ పై ఐపీఎల్ ఓనర్ల కన్ను!
