- Advertisement -

స్పష్టం చేసిన అమిత్ షా

- Advertisement -

ప్రధాని నరేంద్ర మోడీ సారధ్యంలోని కేంద్ర క్యాబినెట్ లో భారీ మార్పులు, చేర్పులు జరగబోతున్నాయా. అవుననే అంటున్నాయి సంకేతాలు. శుక్రవారం నాడు ఈ విషయాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా నిర్దారించారు. తర్వలో క్యాబినెట్ లో మార్పులు, చేర్పులు వుంటాయి. అయితే ఎప్పుడూ అనేది మాత్రం చెప్పలేం అని అమిత్ షా అన్నారు.

అసోం ముఖ్యమంత్రిగా కేంద్ర క్రీడలు, యూత్ సర్వీసుల మంత్రి శర్వానంద్ సోనూవాల్ ప్రమాణం చేశారు. దీంతో ఈ శాఖలో ఖాళీ ఏర్పడింది. దీన్ని భర్తీ చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇక మంత్రివర్గంలో కొందరి పనితీరుపై ప్రధాని అసంత్రప్తితో ఉన్నారు. వారిని తప్పించి పార్టీలో కొందరికి ఆ బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారు. అలాగే ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో కూడా పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది.

ఆయా రాష్ట్రాల్లో పార్టీ బలపడేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. దీంతో క్యాబినెట్ లో మార్పులు చేసి కొందరిని పార్టీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర క్యాబినెట్ లో మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఏర్పడింది. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -