జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ జిల్లా గాజువాకలో నామినేషన్ దాఖలు చేశారు. గురువారం విశాఖ నగరపాలక సంస్థ జోన్-5 కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఆయన వెంట సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారయణతో పాటు పలువురు నేతలు వెంట వచ్చారు. అభిమానులు కూడా భారీ సంఖ్యలో తరలి వచ్చారు. నామినేషన్ అనంతరం గాజువాక, భీమిలి, విశాఖ సౌత్ నియోజకవర్గాల్లో జరగబోయే మూడు ఎన్నికల ప్రచార సభల్లో పవన్ పాల్గొననున్నారు. గాజువాక మాత్రమే కాదు.. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీచేయబోతున్నారు. భీమవరం నుంచి జనసేనాని శుక్రవారం నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ కార్యక్రమానికి జనసైనికులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ నామినేషన్ వేసిన అనంతరం ఎన్నికల ప్రచార సభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు.
- Advertisement -
నామినేషన్ వేసిన జనసేనాని…
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -
