టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు తాజాగా నటిస్తున్న చిత్రం మహర్షి. ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా పూజా హెగ్డె హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే ఎన్నో రిలీజ్ డేట్‌లను మార్చిన ఈ సినిమా మే 9 న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌ను మొదలుపెట్టింది చిత్ర యూనిట్. ఈ సినిమాలోని మొదటి సాంగ్‌ను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. మహర్షిలోని మొదటి సాంగ్‌ను ఈనెల 29న ఉదయం 9 గంటల 09 నిముషాలకు విడుదల చేయనున్నారు.
ఈ పాట ఛోటీ ఛోటీ బాతేన్ అంటూ సాగుతోంది.
చిత్ర యూనిట్ విడుదల చేసిన పోస్టర్‌లో మహేష్ బాబు.. పూజా హెగ్డే.. అల్లరి నరేష్‌లె ఉన్నారు. సముద్రం ఒడ్డున ఉన్న ఒక పచ్చటి కొండ అంచున మహేష్,పూజా, అల్లరి నరేష్‌లు నిలబడి ఉన్నారు. ముగ్గురు సముద్రాన్ని చూస్తూ నిలబడగా వెనక రెండు స్పోర్ట్స్ సైకిల్స్ మాత్రం ఉన్నాయి. పోస్టర్ మాత్రం అదిరిపోయింది. ఈ సినిమా మహేశ్ కెరీర్‌లో 25వ సినిమా కావడంతో మహర్షిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం ఫస్ట్ టైమ్ మహేశ్ ఫుల్‌గా గెడ్డం, మీసం పెంచారు.
- Advertisement -
మహేశ్ ‘మహర్షి’ నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేస్తోంది..!
- Advertisement -
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -
