- Advertisement -

అక్కినేని కథ, రవితేజ కాంపౌండ్ లో కి

- Advertisement -

అక్కినేని నాగ చైతన్య మరియు సమంత జంటగా ఇటీవలే నటించిన చిత్రం మజిలీ. ఈ సినిమా విజయం అనంతరం మరోసారి వీరిద్దరూ కలిసి నటించాలని అభిమానులు కోరుకున్నారు. వీరి ఆశలను నిజం చేస్తూ ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి ఒక సినిమా ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేసాడు. మహా సముద్రం పేరుతో ఈ సినిమా ని తీయాలని అనుకున్న దర్శకుడి కల ప్రస్తుతం నెరవేరేలా కనిపించడం లేదు. ముందుగా రామ్ తో ఒక సినిమా అనుకుంటే, అది వర్క్ అవుట్ కాలేదు. ఆ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమా చేయాలని అనుకుంటే, అది కూడా అవ్వలేదు.

ఇప్పుడు చైతన్య సినిమా చేసేందుకు ముందుకు వచ్చినా, అది కూడా జరిగేలా కనిపించడం లేదు. పొలిసు పాత్ర లో చైతన్య మెరవనున్నారు అనే వార్తలు బయటకు వచ్చినా ఇప్పుడు చైతన్య ఈ సినిమా చేయడం లేదు అని తెలుస్తుంది.

తాజా సమాచారం మేరకు చైతన్య ఈ సినిమా చేయాలి అంటే తన ముందు ఆల్రెడీ ఉన్న సినిమాలు పూర్తి చేయాలి. అంతే కాకుండా చైతన్య దర్శకుడు మేర్లపాక గాంధీ కి ఒక సినిమా చేస్తాను అని ఆల్రెడీ మాట ఇచ్చాడు అంట. దీని బట్టి చూస్తే, అది పూర్తి అయ్యేంత వరకు చైతు ఇంకో సినిమా చేయలేడు. అందుకే అజయ్ వేచి చూసి సమయం వృధా చేసుకోవడం ఎందుకు అని రవి తేజ కి కథ వినిపించినట్టు సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -