Saturday, May 4, 2024
- Advertisement -

అలీ ఉబలాటం.. జగన్ తీరుస్తాడా.?

- Advertisement -

ఏపీ సీఎం జగన్ నామినేటెడ్ పదవులపై దృష్టి సారించారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాటుపడ్డ సీనియర్లకు జగన్ కేబినెట్ లో చోటు దక్కలేదు. దీంతో అలిగిన వారికి జగన్ పదవులు ఇస్తున్నారు. రోజాకు ఏపీఐఐసీ చైర్మన్ పదవి, వైవీ సుబ్బారెడ్డికి టీటీడీ చైర్మన్ పదవులు పంచేశారు. ఇప్పుడు కమెడియన్ ఫృథ్వీకి ఎస్వీబీసీ భక్తి చానెల్ చైర్మన్ పదవిని కట్టబెట్టబోతున్నారు.

కమెడియన్ ఫృథ్వీ వైసీపీ తరుఫున దూకుడుగా రాజకీయం నడిపాడు. జగన్ సీఎం అయినా స్పందించని టాలీవుడ్ పెద్దల తీరును తప్పుపట్టాడు. చంద్రబాబుకు కొమ్ము కాస్తున్నారంటూ బహిరంగ విమర్శలు చేశారు. దీంతో టాలీవుడ్ పెద్దలు ఇతడి అవకాశాలపై దెబ్బ కొడుతున్నారన్న వదంతులు వచ్చాయి. అందుకే జగన్ ఫృథ్వీకి న్యాయం చేసేందుకే ఎస్వీబీసీ చైర్మన్ పోస్టును ఇస్తున్నారని సమాచారం. వైసీపీ గెలుపునకు దోహదం పడ్డ ఫృథ్వీకి మంచి పదవే దక్కిందంటున్నారు.

ఇక కమెడియన్ అలీ కూడా ఇప్పుడు జగన్ పై ఆశలు పెంచుకున్నారు. ఎమ్మెల్యే టికెట్ అడిగిన అలీకి అప్పుడు సమీకరణాల రీత్యా జగన్ టికెట్ ఇవ్వలేదు. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఇస్తానన్నారు. ఇప్పుడు నామినేటెడ్ ఊపులో కనీసం ఎమ్మెల్సీ అయినా లేదా ఏపీ ఫిలిం కార్పొరేషన్ చైర్మన్ పదవి అయినా ఇస్తారని అలీ భావిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు వైసీపీ పెద్దలతో సంప్రదింపులు జరిపినట్టు వార్తలు వస్తున్నాయి.

మరి ఫృథ్వీని కరుణించిన జగన్.. అలీని కూడా కరుణిస్తారా? నామినేటెడ్ లేదా ఎమ్మెల్సీ పదవులు ఇస్తారా అన్నది హాట్ టాపిక్ గా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -