Wednesday, May 1, 2024
- Advertisement -

బాబు కుయుక్తులు.. కాపులలొల్లిలో చిక్కని జగన్..

- Advertisement -

ఏపీలో కాపుల సమస్య చాలా జఠిలమైనది. దాదాపు 20 శాతానికి పైగా జనాభాలో ఉన్న వారిని మచ్చి క చేసుకొని రిజర్వేషన్లు ఇస్తానని 2014లో టీడీపీ అధినేత చంద్రబాబు గద్దెనెక్కారు. కానీ గద్దెనెక్కాక బాబు నైజం తెలిసి ముద్రగడ లాంటి కాపు నేతలు ఉద్యమాలకు ఊపిరిపోశారు. వాటిని ఉక్కుపాదంతో అణిచిన బాబు తర్వాత ఆ వాయిస్ లేకుండా చేశారన్న అపవాదును తెచ్చుకున్నారు.

అయితే 2019 ఎన్నికల్లో కాపులంతా రెడ్డి సామాజికవర్గ జగన్ నాయకత్వంలోని వైసీపీకే ఓటేశారు గెలిపించారు. అయితే ఆశ్చర్యకరంగా ఏపీ అసెంబ్లీలో కాపుల రిజర్వేషన్లపై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన విమర్శలపై ఏపీ సీఎం జగన్ ఆసక్తికర కౌంటర్లు ఇచ్చారు.

చంద్రబాబులా కాపుల రిజర్వేషన్లపై బూమరాంగ్ కాకూడదని జగన్ తెలివిగా తాను ఇచ్చిన అంశాలను, బాబు ఉచ్చులో బిగుసుపోకుండా ఈ సందర్భంగా అసెంబ్లీలోనే చదివి వినిపించడం విశేషం.

కాపుల రిజర్వేషన్ల అంశం కేంద్రం పరిధిలో ఉందని.. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కాపుల కోసం 2వేల కోట్లు కేటాయించిన విషయాన్ని జగన్ గుర్తు చేశారు. మంజునాథ కమిషన్ సిఫారసను తాము అమలు చేస్తామన్నారు. అందుకే కాపులు ఎక్కువున్న తూర్పు గోదావరిలో తమను కాపులు గెలిపించారని జగన్ చెప్పుకొచ్చారు. ఇలా తెలివిగా కాపుల ఆగ్రహానికి గురికాకుండా జగన్ అసెంబ్లీలో మాట్లాడి కాపులలొల్లిలో చిక్కుకోకుండా తప్పించుకోవడం గమనార్హం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -