- Advertisement -

తీవ్ర చిక్కుల్లో బాబు.. తెరపైకి కాల్ మనీ, పుష్కర మరణాలు

- Advertisement -

చంద్రబాబు ముఖ్యమంత్రిగా సాగించిన అక్రమ చర్యలన్నింటిని అసెంబ్లీ సాక్షిగా బయటపెడుతూ అధికార వైసీపీ సంచలనాలు రేపుతోంది. చంద్రబాబును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇప్పటికే చంద్రబాబుకు తోడుగా అసెంబ్లీలో చెలరేగిపోతున్న అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, నిమ్మలను బడ్జెట్ సమావేశాల మొత్తం సస్పెండ్ చేయించింది అధికార పక్షం. ఇప్పుడు కౌంటర్లు ఇవ్వడానికి కేవలం ఒక్క బాబు మాత్రమే ఉన్నారు. ఈ అవకాశాన్ని బేస్ చేసుకొని తాజాగా బుధవారం ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు గత ప్రభుత్వంలో చేసిన పాపాల చిట్టాను వైసీపీ బయటపెట్టడం సంచలనంగా మారింది.

గోదావరి పుష్కరాల పేరిట చంద్రబాబు చేసిన 3వేల కోట్ల ఖర్చు.. దర్శకుడు బోయపాటితో షూటింగ్ నిర్వహించి తొక్కిసలాటలో 29మంది మరణానికి కారణమయ్యారని వైసీపీ అసెంబ్లీలో తీవ్ర ఆరోపణ చేసింది. ఆ నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపించింది. పుష్కరాల ఘటనపై విచారణ చేయిస్తామని ప్రకటించడం సంచలనంగా మారింది. చంద్రబాబు తనో హీరోలా బాహుబలిలో ప్రచార పిచ్చితోనే దర్శకుడు బోయపాటిని పెట్టి ఇలా 29మంది ప్రాణాలు తీశారని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. ఈ మరణాలపై నివేదించిన సోమయాజుల కమిటీ నివేదికను చంద్రబాబు తొక్కిపెట్టారని సభ ముందుంచడం సంచలనమైంది.

ఇక శాసనమండలిలో టీడీపీ హయాంలో చోటుచేసుకున్న అతిపెద్ద కాల్ మనీ స్కాం గురించి కూడా చర్చ జరిగింది. ఇందులో టీడీపీ ఎమ్మెల్యేల ప్రమేయం.. ప్రభుత్వం ఉదాసీనత కాపాడిన వైనంపై కూడా చర్చ జరిగింది. కాల్ మనీపై కూడా విచారణ చేయిస్తామని వైసీపీ ప్రభుత్వం చెప్పడంతో ఇప్పుడు చంద్రబాబు ఇరకాటం పడ్డారు.

ఇలా బాబు మెడకు ఇప్పుడు కాల్ మనీ, పుష్కరాల్లో 29మంది మరణం ఇష్యూలు చుట్టుకున్నాయి. దీనిపై విచారణకు ప్రభుత్వం సిద్ధపడడంతో బాబు పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -