- Advertisement -

కొత్త అవతారం ఎత్తనున్న ధోని…సోషల్ మీడియాలో పిక్ వైరల్…

- Advertisement -

విండీస్ టూర్ నుంచి తప్పుకున్న మహేంద్రసింగ్ ధోని రెండు నెలల పాటు ఆర్మీలో విధులు నిర్వహించి ఇంటికి చేరుకున్నారు. విండీస్ తరువాత సౌతాఫ్రికా టూర్ కు ఎంపిక అవుతాడా లేదా అన్నది అనుమానంగా ఉంది. ఇప్పటికే ధోని రిటైర్మెంట్ ప్రకటించాలని అన్ని వర్గాలనుంచి విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ధోని మరో కొత్త అవతారం ఎత్తారు.

గతంలో ధోని భాజాపాలో చేరుతున్నారనె వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. లెహ్‌లో సైనిక విధులు ముగించుకొని రాగానే రాజకీయ నాయకుడిగా మారిపోయాడు. కుర్తా పైజామా, ఖద్దరు దుస్తులు ధరించి రెండు చేతులు పైకెత్తి నమస్కారం చేశాడు. దీంతో ధోని రాజకీయాల్లో చేరుతున్నానె వార్తలు మరో సారి గుప్పుమన్నాయి. రాజకీయ నాయకుడిగా ఉన్న ధోనీ చిత్రాలను అభిమానులు సోషల్‌ మీడియాలో విపరీతంగా పంచుకోవడంతో అవి వైరల్‌గా మారిపోయాయి.

ఆర్మీలో సైనిక విధులు ముగించుకొని ఇంటికి తిరిగి రాగానే ఇదిగో… ఇలా రాజకీయ నాయకుడి చిత్రాలు దర్శనమిచ్చాయి. అసలు ఇంతకీ ఏం జరగిందంటే?ఓ యాడ్‌ షూటింగ్‌ కోసం ధోనీ ముంబయి వెళ్లాడు. అక్కడ కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. అందులో ఒక హోర్డింగ్‌పై మహీ రాజకీయ నాయకుడిగా కనిపించాడు. క్రేజీగా భావించిన అభిమానులు వెంటనే సోషల్‌ మీడియాలో వాటిని షేర్ చేయడంతో వైరల్ గా మారాయి. దీనిపై నెటిజన్లు తమ దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -