Tuesday, April 30, 2024
- Advertisement -

పేయిడ్ ఆర్టిస్ట్ తో బట్టబయలయిన టీడీపీ బండారం… వెలుగులోకి సంచలన విషయాలు

- Advertisement -

మొన్నటి ఎన్నికల్లో వైసిపి అఖండ మెజారిటితో అధికారంలోకి రావడంతో చంద్రబాబు, లేకేష్ లు తట్టుకోలేక పోతున్నారు. ప్రభుత్వానికి ఆరు నెలలు సమయం ఇస్తామని చెప్పిన బాబు మాట తప్పి ప్రభుత్వంపై మాటల దాడి మొదలు పెట్టారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు అవకాశం వచ్చినా రాకపోయినా ఏదో రూపంలో ప్రయత్నాలు చేస్తూనె ఉన్నారు. ఒక వైపు చినబాబు లోకేష్ ట్విట్టర్ లో జగన్ నుటార్గెట్ చేస్తే..మరో వైపు బాబు ప్రెస్ మీట్లు, పార్టీ కార్యకక్రమాల్లో విమర్శలు మొదలు పెట్టారు.

ఇది చాలదన్నట్లు సోషల్ మీడియా ద్వారా జగన్ ప్రభుత్వం పై దుస్ప్రచారానికి తెగబడ్డారు బాబు, లోకేష్. ఇందుకోసం ఎంతకు తెగించారంటే చివరకు పెయిడ్ ఆర్టిస్టులను కూడా రంగంలోకి దింపేశారు. ఇలాంటి నీచమైన పద్దతికి గతంలో ఏ పార్టీ కూడా దిగజారలేదు.

టిడిపి రంగంలోకి దింపిన పెయిడ్ ఆర్టిస్టుల పనేమిటంటే ప్రతీ అంశంలోను జగన్ ను వ్యతిరేకించటమే. ప్రభుత్వాన్ని గబ్బుపట్టిస్తు తీవ్రమైన వ్యాఖ్యలు చేయటం. సామాన్య జనాలుగా అంటే రైతులుగా, ఉద్యోగులుగా, ఇంటిపట్టునున్న మహిళలుగా, జగన్ ప్రభుత్వంలో బాధితులుగా వేషాలు వేసుకుని జగన్ ను మంత్రులను నోటికొచ్చినట్లు తిట్టటమే వీళ్ళ పని. వీళ్లు తిట్టన వీడియోలను సోషల్ మీడాయాలో ప్రచారం చేయడం.

జగన్ ప్రభుత్వంపై సామాన్య జనాల స్పందన అంటూ అతి తెలివి లోకేష్ తన ట్విట్టర్ ఖాతాలో వాటికి బాగా ప్రచారం కల్పిస్తారు. ఇదంతా తండ్రి, కొడుకులు ఓ పద్దతి ప్రకారం నిర్వహిస్తున్న నాటకమని తేలిపోయింది. మొన్నటి వరద ముంపు ప్రాంతాలపై ఓ రైతు జగన్ , మంత్రి అనీల్ కుమార్ యాదవ్ ను ఘాటుగా నోటికొచ్చినట్లు తిట్టటంతో అందరికీ అనుమానం మొదలైంది.ఇంకేముంది వైసీపీ సోషల్ మీడియా రంగంలోకి దిగింది. ఎట్టలకేలకు తప్పుడు ప్రచారాలు చేస్తున్న పేయిడ్ ఆర్టిస్టుల అక్రమాలను బయటపెట్టారు.

ఆ పార్టీనేతలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు పేయిడ్ ఆర్టిస్ట్ శేఖర్ ను అరెస్ట్ చేశారు. విచారణలో శేఖర్‌ సంచలన విషయాలు బయటపెట్టారు.రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడానికి తాను ఒక్కడినే కాదని, తమ లాంటి టీమ్‌లు చాలా పనిచేస్తున్నాయని గుట్టు విప్పినట్టు ప్రచారం సాగుతోంది. తమలాంటి వారికి నెలవారీగా వేతనాలు ఇచ్చి, ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేయడానికి వాడుకుంటున్నారని వెల్లడించారు. తప్పుడు వీడియోల వెనుక టాలీవుడ్ డైరెక్టరలు ఉన్నట్లు తెలిపారు. పెయిడ్ ఆర్టిస్ట్ పట్టుబడటంతో టిడిపి ఎంత నీచానికి దిగజారిపోయిందన్నది మరోమారు స్పష్టమైంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -