ఎన్నికల ప్రచారంలో ఇచ్చి హామీల ప్రకారం సీఎం జగన్ మరో సంచలన నిర్నయంతీసుకున్నారు.ఎన్నిల ముందు గిరిజనులకు ఇచ్చిన హామీని నేడు నెరవేర్చారు. రెండేళ్ల కిందట బాక్సైట్ తవ్వకాలను రద్దు చేస్తామని సీఎం ప్రకట. బాక్సైట్ తవ్వకాల అనుమతి రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సీఎం జగన్ మోహన్ రెడ్డి. 30 ఏళ్లపాటు ఏపి ఎండీసీకి ఇచ్చిన అనుమతులు రద్దు చేస్తూ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మొత్తం 2,226 హెక్టార్లలో బాక్సైట్ తవ్వకాలకు ఇచ్చిన అనుమతులు రద్దు కానున్నాయి. అనంతగిరి రిజర్వ్ ఫారెస్ట్, చింతల జెర్రెల బ్లాక్ 1,2,3, గాలికొండ, చిత్తమగొంది, రక్తకొండ, చింతపల్లి రిజర్వ్ ఫారెస్ట్ గ్రామాల్లో బాక్సైట్ అనుమతులు రద్దు అవుతాయి.సీఎం జగన్ నిర్ణయంపై విశాఖ మన్యంలోని గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏన్నో ఏళ్ల తమ పోరాటానికి ఫలితం దక్కిందని చెప్పారు.
