ప్రేమికుల రోజు త‌రుణ్ వ‌స్తాడంట‌

- Advertisement -
  • నా ల‌వ్‌స్టోరీ ట్రైల‌ర్ విడుద‌ల‌

ఒకప్పుడు లవర్ బాయ్‌గా గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ కొన్నేళ్లుగా సినిమాల‌కు దూర‌మ‌య్యారు. చిన్నతనం నుంచే సినిమాల్లో న‌టిస్తున్న త‌రుణ్ కొన్ని సంవ‌త్స‌రాలుగా సినిమాల‌తో రాలేక‌పోయాడు. సినిమాలు అయితే లేకున్నాఅప్పుడ‌ప్పుడు బుల్లితెర మీద క‌నిపిస్తున్నాడు. సినీ, బుల్లితెర క్రికెట్ ఈవెంట్లు జ‌రిగితే మాత్రం త‌రుణ్ ఎప్పుడూ ముందుంటాడు. కొత్త హీరోల‌తో పోటీప‌డి మ‌రీ క్రికెట్ ఆడుతుంటాడు. అయితే ఇటీవ‌ల ఓ సినిమాతో త‌రుణ్ త్వ‌ర‌లో రానున్నాడు. ప్రేమికుల రోజు ఫిబ్ర‌వ‌రి 14వ తేదీన థియేట‌ర్ల‌లోకి వ‌స్తాడంట‌. త‌ను న‌టించిన సినిమాఇది నా ల‌వ్‌స్టోరీ అనే సినిమా ట్రైల‌ర్‌ను త‌రుణ్ జ‌న్మ‌దినం (జ‌న‌వ‌రి 7వ తేదీ) సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 8న విడుద‌ల చేశారు. ప‌నిలో ప‌నిగా సినిమా విడుద‌ల తేదీని ప్ర‌క‌టించారు.

తరుణ్ 2013లో ఒక కన్నడ హిట్ కథను తెలుగులో రీమేక్ చేయాలని త‌రుణ్ అనుకున్నాడు. మొదట కొన్ని ఇబ్బందులు వచ్చినా ఆ తరువాత మొత్తానికి సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని టీజ‌ర్, పాటలను కూడా విడుద‌ల‌ చేశారు. అయితే ఇప్పటివరకు ఆ సినిమా విడుద‌ల‌ కాలేదు. ఇవాళ రేపు అంటూ వ‌చ్చిన ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 14వ తేదీన థియేట‌ర్ల‌లోకి వ‌స్తాడ‌ని ప్ర‌క‌టించారు.గ‌తంలో మంచి సినిమాల‌తో వ‌చ్చిన త‌రుణ్ మ‌ళ్లీ సినీ ప‌రిశ్ర‌మ‌లో నిల‌దొక్కుకోవాల‌ని చూస్తున్నాడు. మ‌ళ్లీ అత‌డికి మంచి భ‌విష్య‌త్ తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో ద‌క్కాల‌ని ఆద్య న్యూస్ ఆకాంక్షిస్తోంది. అదే విధంగా త‌రుణ్‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు చెబుతున్నాం.

- Advertisement -

 

 

 

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -