Sunday, May 12, 2024
- Advertisement -

‘2 అవర్స్ లవ్’ రివ్యూ & రేటింగ్

- Advertisement -

చిత్రం: 2 అవర్స్ లవ్
నటీనటులు: శ్రీ పవర్, కృతి గర్గ్, తనికెళ్ళ భరణి, వర్ధన్, నర్సింగ్ యాదవ్ తదితరులు
నేపధ్య సంగీతం: గ్యాని సింగ్
ఛాయాగ్రహణం: ప్రవీణ్ వనమాలి
ఎడిటింగ్‌: శ్యామ్ వడవల్లి
నిర్మాత: శ్రీనివాస్ అంగోత్
దర్శకత్వం: శ్రీ పవర్
బ్యానర్: శ్రీనిక క్రియేటివ్ వర్క్స్
విడుదల తేదీ: 05/09/2019

ఈ మధ్య కాలంలో తెలుగులో బోలెడు కొత్త దర్శకులు మరియు నటీనటులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే అలా స్మాల్ బడ్జెట్ మూవీగా విడుదలై కూడా బ్లాక్ బస్టర్ గా మారిన సినిమాలు లేక పోలేదు. తాజాగా మరొక చిన్న బడ్జెట్ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదే ‘2 అవర్స్ లవ్’. ఒక ఆసక్తికరమైన కాన్సెప్ట్తో యువ దర్శకుడు శ్రీ పవర్ ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో హీరోగా కూడా శ్రీ పవర్ నటించగా హీరోయిన్ గా కృతి గర్గ్ నటించింది. తనికెళ్ల భరణి ముఖ్యపాత్ర పోషించిన ఈ సినిమా ఒక డిఫరెంట్ ప్రేమ కథ గా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మరి ఈ సినిమాతో శ్రీ పవర్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకున్నాడో చూసేద్దామా..

కథ:
అధయ్ (శ్రీ పవర్) ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. తను నయన (కృతి గర్గ్) అనే ఒక అమ్మాయి తో ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి మాత్రం ఓకే చెప్పే ముందు కొన్ని కండిషన్లు పెడుతుంది. అందులో భాగంగా నైనా కేవలం సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల వరకు మాత్రమే ప్రేమిస్తుంది. ఇద్దరూ అగ్రిమెంట్లు కూడా రాసుకుని ప్రేమించుకోవడం మొదలు పెడతారు. మరోవైపు విలన్ గ్యాంగ్ నైనా పై దాడి చేయాలని ప్రయత్నిస్తుంటారు. అధయ్ నయన ని కాపాడటానికి ప్రయత్నిస్తాడు. కానీ సాయంత్రం నాలుగు గంటల తర్వాతే మాట్లాడతాను అంటూ ఆమె అతని మాటలు వినిపించుకోదు. అసలు వీళ్లిద్దరి మధ్య అగ్రిమెంట్ ఏంటి? వారి ఫ్లాష్ బ్యాక్ లో ఏం జరిగింది? రోజుకి కేవలం రెండు గంటలు మాత్రమే ప్రేమిస్తానని నయన ఎందుకు చెబుతుంది? ఈ విలన్ గ్యాంగ్ ఎవరు? వారికి నయన కి మధ్య సంబంధం ఏంటి? చివరికి నయన, అధయ్ కలిసారా లేదా? విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటులు:
కొత్తవాడు అయినప్పటికీ శ్రీ పవర్ హీరో గా చాలా బాగా నటించాడు. డైలాగ్ డెలివరీలో కానీ, నటన పరంగా కానీ, హావభావాల పరంగా కానీ, శ్రీ పవర్ నటన ఈ సినిమాకి అన్ని విధాలుగా ప్లస్ అయింది. కృతి గర్గ్ ఈ సినిమాలో చాలా అందంగా కనిపించడం మాత్రమే కాక తన నటనతో పర్ఫార్మెన్స్ తో కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ముఖ్యంగా శ్రీ పవర్ తో తన కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. వారిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు చాలా బాగుంటాయి. తనికెళ్ల భరణి నటన ఈ సినిమాకి హైలైట్ గా చెప్పుకోవచ్చు. చాలా వరకు కొత్త వాళ్ళు అవడంతో తనికెళ్ల భరణి స్క్రీన్ ప్రెజెన్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. తన పాత్రకి పూర్తి స్థాయిలో న్యాయం చేశారు తనికెళ్ల భరణి. నర్సింగ్ యాదవ్ కూడా చాలా సహజంగా నటించారు. వర్ధన్ కూడా ఈ సినిమాలో చాలా బాగా నటించాడు. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు చాలా బాగా నటించారు.

సాంకేతిక వర్గం:
ఒక నటుడిగా మాత్రమే కాకుండా శ్రీ పవర్ దర్శకుడిగా కూడా తన ప్రతిభను ఈ సినిమా ద్వారా చాటాడు..ముఖ్యంగా హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ చాలా బాగుంటుంది. ఇప్పటిదాకా చూడనటువంటి కొత్త కాన్సెప్ట్ ఈ సినిమాకి ప్లస్ అయ్యింది. అంతేకాకుండా ఒక చిన్న పాయింట్ ని పట్టుకుని ఒక ఆసక్తికరమైన కథ గా మార్చి దాన్ని ప్రేక్షకుల ముందు ప్రెజెంట్ చేసిన విధానం అందర్నీ కచ్చితంగా ఆకట్టుకుంటుంది. కొత్త వాడు అయినప్పటికీ శ్రీ పవర్ దర్శకత్వంలో కూడా చాలా అనుభవం ఉన్న వాడిలా అనిపించాడు. ప్రేక్షకులకు ఎక్కడా బోరు కొట్టకుండా కథను చాలా బాగా తెరకెక్కించాడు. శ్రీనిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ అందించిన నిర్మాణ విలువలు ఈ సినిమాకు మరింత ప్లస్ అయ్యాయి. చిన్న బడ్జెట్ సినిమా అయినప్పటికీ కథకు సరిపడా బడ్జెట్ ని అందించారు. గ్యాని సింగ్ అందించిన పాటలు ఈ సినిమాకి మరింత హెల్ప్ అయ్యాయి. పాటలు మాత్రమే కాకుండా గ్యాని అందించిన నేపథ్య సంగీతం కూడా సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని మరింత ఆసక్తికరంగా మార్చింది. ప్రవీణ్ వనమాలి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్ ని చాలా అందంగా మలిచారు ప్రవీణ్ వనమాలి. శ్యామ్ వడవల్లి ఎడిటింగ్ కూడా ఫర్వాలేదనిపిస్తుంది.

బలాలు:
స్క్రీన్ ప్లే
సరికొత్త కథ
సంగీతం
కథలోని ట్విస్టులు

బలహీనతలు:
కొన్ని సాగతీత సన్నివేశాలు
కామెడీ అంతగా లేకపోవడం

చివరి మాట:
‘2 అవర్స్ లవ్’ ఒక న్యూ ఏజ్ లవ్ స్టోరీగా చెప్పుకోవచ్చు. సినిమా చాలా ఆసక్తికరంగా మొదలవుతుంది. మొదటి హాఫ్ మొత్తం చాలా కామెడీ మరియు రొమాన్స్ తో నిండి ఉంటుంది. ముఖ్యంగా హీరో హీరోయిన్ల మధ్య సన్నివేశాలను చాలా బాగా తెరకెక్కించారు. రొటీన్ కథలకు భిన్నంగా కొత్త కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకి రావడం తో ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇక మొదటి హాఫ్ తో పోల్చుకుంటే రెండవ హాఫ్ కొంచెం ఎమోషనల్గా మరియు యాక్షన్ తో నిండి ఉంటుంది. అయితే ఎంటర్ టైన్ మెంట్ కి మాత్రం ఏ మాత్రం కొదవ లేకుండా సినిమా ఆద్యంతం ప్రేక్షకులను కట్టిపడేసే విధంగా ఆసక్తికరంగా సాగుతుంది. స్క్రీన్ప్లే మరియు సరికొత్త కథ ఈ సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి. అయితే రెండవ హాఫ్ లో కొన్ని సాగతీత సన్నివేశాలు ప్రేక్షకులకు కొంత బోర్ కొట్టించే అవకాశాలున్నాయి. ఇక చివరిగా ‘2 అవర్స్ లవ్’ యూత్ ని టార్గెట్ చేస్తూ వారిని మెప్పించేలా విడుదలైన ఒక ఆసక్తికరమైన కథ. ప్రేమ కథలు అంటే ఇష్టం ఉన్నవారు ఈ సినిమాని హ్యాపీగా చూసేయొచ్చు.

బాటమ్ లైన్: ‘2 అవర్స్ లవ్’ సినిమాతో 2 అవర్స్ ఎంటర్టైన్మెంట్
రేటింగ్: 3.25/5

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -