Saturday, May 4, 2024
- Advertisement -

“అర్జున్ సురవరం” మూవీ రివ్యూ

- Advertisement -

టాలీవుడ్ లో హీరో నిఖిల్ కి మంచి గుర్తింపు ఉంది. డిఫరెంట్ స్టోరీలతో సినిమాలను తీయడంలో నిఖిల్ కి మంచి టెస్ట్ ఉంది. తాజాగా టి సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కిన “అర్జున్ సురవరం” చిత్రంలో నిఖిల్ నటించాడు. అనేక వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఈ రోజు ఈ సినిమా రిలీజ్ అయింది. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ :

అర్జున్ లెనిన్ సురవరం(నిఖిల్) బీబీసీ ఛానల్లో జర్నలిస్ట్ కావాలాని ప్రయత్నిస్తుంటాడు. అయితే ఓ చిన్న ఛానెల్లో పని చేస్తున్న అర్జున్.. ఓ కేసులో ఇరుక్కుంటాడు. మరో పక్క ఫేక్ సర్టిఫికెట్లను తయారు చేసే ఓ భయంకరమైన మాఫియా కథనం సాగుతు ఉంటుంది. అయితే అర్జున్ ఇరుకున్న కేసు ఏంటి ? ఆ కేసు కి ఈ మాఫియాకి లింక్ ఏంటి ? అర్జున్ ఆ కేసు నుంచి బయటకు ఎలా వచ్చాడు ? హీరోయిన్ లావణ్య పాత్ర ఏంటి ? అనేవి చూడాలంటే సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

ముఖ్యంగా ఈ సినిమాకి ప్లస్ పాయింట్ హీరో నిఖిల్. అతను అర్జున్ లెనిన్ సురవరంగా అద్భుతంగా నటించాడు. జర్నలిస్ట్ పాత్రకు పూర్తి నాయం చేశాడు. లావణ్య త్రిపాఠి చాలా బాగుంది. నిఖిల్, లావణ్య మధ్య కెమిస్ట్రీ కూడా బాగుంది. దర్శకుడు టి సంతోష్ చేసిన ప్రయోగం సఫలం అయిందని చెప్పొచ్చు. ఇదే సినిమాని తమిళంలో కనితన్ గా టి సంతోష్ తెరకెక్కించి హిట్ అందుకున్నాడు. తెలుగులో కూడా అయననే దర్శకత్వం వహించి నిఖిల్ కి హిట్ అందించాడు. కథానం తో అద్భుతంగా సినిమా సాగుతోంది. స్క్రీన్ ప్లే లో వచ్చే ట్విస్టులు.. హీరో, విలన్ మధ్య వచ్చే సీన్స్ ప్రేక్షకులను బాగా అలరిస్తాయి. ఇంటర్వల్ ముంచు వచ్చే సీన్స్ అన్ని అద్భుతమే. ఎమోషన్స్ సహా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ను కూడా సమపాళ్లలో దర్శకుడు జోడించాడు. అలానే తాను చెప్పాలనుకున్న పాయింట్ ను బాగా చెప్పాడు. నెగిటివ్ రోల్ లో కనిపించిన తరుణ్ అరోరా కమెడియన్ వెన్నెల కిషోర్ లు వారి పాత్రలకు సరైన న్యాయం చేసారు. సామ్ సీఎస్ అందించిన పాటలు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సినిమాకు మరో ప్లస్ పాయింట్. సూర్య అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ : మైనస్ పాయింట్స్ విషయంకు వస్తే ఫస్ట్ లో కాస్త నెమ్మదిగా సాగుతోంది. కథానం మొత్తం సీరియస్ మూడ్ లోనే ఉంటుంది. కమర్షియల్ హంగులు మాములుగా ఉన్నాయి.

మొత్తంగా : మొత్తంగా చూస్తే ఫస్ట్ ఆఫ్ లో కాస్త నెమ్మదిగా సాగిన.. రాను రాను సినిమా స్పీడ్ పెరుగుతోంది. చూసే ప్రేక్షకుడికి ఆసక్తి కలుగుతోంది. దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ ను అద్భుతంగా చెప్పాడు. మంచి సందేశం కూడా ప్రేక్షకులను థ్రిల్ చేస్తోంది. మొత్తానికి నిఖిల్ కి మరో హిట్ పడిందని చెప్పవచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -