వీరు తెలుగు దర్శకులు కాదు.కాకపోతేనేం మనవాళ్లు వారికి అగ్రతాంభూలమిచ్చారు.మీ ప్లేవర్ మాకు నచ్చిందంటూ నెత్తిన పెట్టి చూసుకున్నారు.మన హీరోలతోనే సినిమాలు చేయమని ఎంకరేజ్ చేశారు.
కాని ఇదంతా గతం.ఇపుడు సీన్ పూర్తిగా మారిపోయింది.మన తెలుగు సినీ జనాలు….. వారినిపుడు మీరెక్కడ తంబీ అనేవరకు మ్యాటర్ వెళ్లిపోయింది.తెలుగులో మాంచి టేస్ట్ ఉన్న డైరెక్టర్లు అనిపించుకున్న వారే ఇపుడు మీరు మాకవసరం లేదనేస్తున్నారు.
ఇలా అనిపించుకుంటోన్న ఆ దర్శకులు ఎవరో కాదు. కరుణా కరన్ ,బొమ్మరిల్లు భాస్కర్ ,ఎస్ జే సూర్య,ధరణి,విష్ణువర్దన్ .వీరిలో కరుణా కరణ్ కే కాస్తో కూస్తో…. తెలుగులో ఇంకా గ్రిప్ ఉంది.టాలీవుడ్ కు ఇంకా ఏదో చేస్తాడనే నమ్మకం ఉంది.భాస్కర్ ,సూర్యలనైతే మర్చిపోయారు.బంగారం ధరని నైతే…. మీరెవరు అంటున్నారు.పంజా ఫేం విష్ణువర్దన్ ను మనవాళ్లు ‘నో’ అని చెప్పే లోపలే…. అతనే మనల్ని నో అనేశాడు.మన టేస్ట్ ఆయనగారికి నచ్చలేదు. ఏది ఏమైనా సాంబార్ బ్యాచ్ టాలీవుడ్లో మిస్సింగ్ బ్యాచ్ గా మారిపోయింది
