సినీ నటుడు, హిందుపురం టీడీపీ ఎమ్మెల్యే బాలయ్య అభ్యర్థి మరోసారి తన నోటికి పని చెప్పాడు. గతంలో ఆయన చాలాసార్లు అభిమానులపై దరుసగా ప్రవర్తించిన సంగతి అందరికే తెలిసిందే. ఇటీవలే టీడీపీ కార్యకర్తపై చేయి చేసుకున్నాడు బాలయ్య. దీంతో ఆ కార్యకర్త పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరాడు. తాజాగా బాలయ్య మరోసారి తన విశ్వరూపం ప్రదర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన హిందుపురంలో పర్యటిస్తున్నారు.
ఈసారి జరిగే ఎన్నికల్లో తనకు వచ్చే మెజారిటీ పై అభిమానులు చేసిన వ్యాఖ్యలతో హద్దు దాటి మాట్లాడారు. నిన్న(మంగళవారం) రాత్రి హిందూపురం పరిధిలో రోడ్ షో నిర్వహిస్తున్న వేళ, జై బాలయ్య అని నినాదాలు చేశారు అభిమానులు. ఈ సందర్భంగా అభిమానులు ఆయనకు 40 వేలు మెజారిటీ వస్తుందని, 60 వేలు మెజారిటీ వస్తుందని స్లోగన్స్ చేయడం మొదలుపెట్టారు. ఈ స్లోగన్స్ విన్న బాలయ్య తనదైన శైలిలో రెచ్చిపోయాడు. వేలు ఏంట్రా? అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, తనదైన శైలిలో డైలాగులు కొట్టారు.
నీ ఎంకమ్మా, వేలు ఏంట్రా వేలు,నీ బొంద,వేల మెజారిటీ కాదు,ఇలాగేనే చెప్పది, నీ పేరేంట్రా చెప్పురా?,నీ సంగతి చెబుతా,వేసి పడదొబ్బుతా అంటూ కార్యకర్తలపై మండిపడ్డాడు బాలయ్య. బాలయ్య అనుహ్యా చర్యతో అక్కడ ఉన్న కార్యకర్తలు షాక్ గురైయ్యారు. తన వ్యాఖ్యలతో, చేష్టలతో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నాడు బాలయ్య. మరి ఈ ఎన్నికల్లో బాలయ్యకు ఎలాంటి తీర్పు వస్తుందో చూడాలి.
- Advertisement -
కార్యకర్తపై మరోసారి రెచ్చిపోయిన బాలయ్య..!
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -
