Saturday, May 4, 2024
- Advertisement -

కౌషల్ ఆర్మీ మాస్టర్ ప్లాన్ అదిరింది

- Advertisement -

కౌషల్ ఆర్మీ వ్యూహాలు ప్రత్యర్ధులకు దిమ్మతిరిగేలా ఉంటున్నాయి. ఓ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకో, పార్లమెంట్ ఎన్నికలకో రాజకీయనేతలు వ్యూహరచన చేసే స్థాయిలో బిగ్ బాస్ ఓటింగ్ విషయంలో ఎత్తుకు పైఎత్తులు వేస్తోంది కౌషల్ ఆర్మీ. కౌషల్ ను టార్గెట్ చేసినవారిని కౌషల్ ఆర్మీ టార్గెట్ చేస్తోంది. ఆ క్రమంలో హౌస్ లో ఉన్నవారిని హిట్ లిస్ట్ లో పెట్టింది. ఏ1, ఏ2, ఏ3, ఏ4 అంటూ కేటగిరీలుగా కౌషల్ ప్రత్యర్ధులను ఎలిమినేట్ చేస్తూ వస్తోంది. అలా కౌషల్ ఆర్మీ హిట్ లిస్టులో ఉండి ఎలిమినేట్ అయినవాళ్లే కిరీటి, భానుశ్రీ, తేజశ్వీ, నందిని, గోగినేని, దీప్తి సునైనా. తమ ఎలిమినేషన్ కు కౌషల్ ఫాలోయింగ్, కౌషల్ ఆర్మీ ఓటింగే కారణమని తెలుసుకుని కిరీటి, తేజశ్వి, నందిని, భానుశ్రీ, సునైనా కసితో రగిలిపోతున్నారు. బిగ్ బాస్ హౌస్ లోనే కాకుండా, హౌస్ బయటా కౌషల్ మీద ఇంకా విషం కక్కుతున్నారు. ఈ ఎలిమినేట్ బ్యాచ్ అంతా హౌస్ బయట మళ్లీ గ్రూప్ కట్టేశారు. గోగినేని, తేజశ్వి, కిరీటి కలుసుకుని ఎలిమినేటర్స్ గ్రూపుకు నాయకత్వం వహిస్తున్నారు. కౌషల్ కు వ్యతిరేకంగా ఆన్ లైన్ ఓటింగ్ లో పెద్దఎత్తున పాల్గొంటున్నారు. వీళ్ల ఆలోచన ఏంటంటే…. తాము ఎటూ ఎలిమినేట్ అయిపోయాం. కౌషల్ కూడా ఎలిమినేట్ అయిపోవాలి. కౌషల్ తప్ప హౌస్ లో ఎవరు గెలిచినా ఫర్వాలేదు. అనే కసితో ఎలిమినేటర్స్ గ్యాంగ్ వారం వారం ఓటింగ్ లో పాల్గొంటోంది. సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని మరీ తేజశ్వి, కిరీటి కౌషల్ కు వ్యతిరేకంగా పలువురు సాఫ్ట్ వేర్ ఉద్యోగుల ద్వారా ఆర్గనైజ్డ్ ఓటింగ్ నిర్వహిస్తున్నారు.

ఈ ఎలిమినేటర్స్ గ్యాంగ్ ప్రస్తుతం హౌస్ లో ఉన్న తనీష్, సామ్రాట్, గీతామాధురి, టీవీ9 దీప్తి, రోల్ రైడా, గణేశ్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ తో టచ్ లో ఉంటున్నారు. మొదట్నీంచి గీతామాధురికి ఉన్న అభిమానులను, పులిహోరా స్టార్ తనీష్, డబ్ మాస్ దీప్తి సునైనా ఫాలోవర్స్ ను ఏకం చేస్తున్నారు. వీళ్లందరి లక్ష్యం ఒక్కటే. కౌషల్ ను ఓడించడం. అందుకే ఎలిమినేటర్స్ గ్యాంగ్ వీళ్లందరి ఫాలోవర్సును ఏకం చేస్తూ…కౌషల్ ఓటు బ్యాంకును చీల్చడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కౌషల్ నామినేట్ అయితే చాలు… వీళ్లందరూ అతడికి వ్యతిరేకంగా మిగిలిన సభ్యులు ఎవరుంటే వారికి భారీ సంఖ్యలో ఓట్లు వేస్తున్నారు. అంతేకాదు కౌషల్ ఆర్మీ ఓట్లు చీల్చే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని గ్రహించిన కౌషల్ ఆర్మీ ఫైనల్ కు ఓ మాస్టర్ ప్లాన్ వేసింది.

మా లక్ష్యం ఇతరులను ఓడించడం కాదు, కౌషల్ ను గెలిపించడం… అంటూ ఫోకస్ అంతా కౌషల్ కు అత్యధిక ఓట్లు వేసి సేవ్ చేయడంపైనే దృష్టి పెట్టింది. ఫైనల్ లో కౌషల్ తో పాటు గీతామాధురి, తనీష్, సామ్రాట్ ఉండాలని ఇప్పుడు కౌషల్ ఆర్మీ కోరుతోంది. అలా అయితే వాళ్లు కౌషల్ ను ఓడించడం కన్నా తమ తమ అభిమాన కంటెస్టెంట్ గెలుపు కోసం వాళ్లు ప్రయత్నిస్తారు. వాళ్లు ఎంత గింజుకున్నా ఒక్కొక్కరికీ కోటి ఓట్లు కూడా రావు. అని అంచనా వేస్తున్నారు. దీంతో కౌషల్ కనీసం 12కోట్ల మెజార్డీతో టైటిల్ విన్నర్ అవుతాడని భావిస్తున్నారు. కౌషల్ ఆర్మీ ఓట్లు స్ప్లిట్ చేయాలని ఇప్పుడు చేస్తున్న కుట్రలు, ఐక్యత అప్పుడు ఉండవని, ఎవరి కంటెస్టెంట్ కోసం వాళ్లు ఫైట్ చేస్తారని, దీంతో కౌషల్ గెలుపు నల్లేరుపై నడక అని భావిస్తున్నారు. వీరి ఆలోచన కూడా బాగానే వుంది. మరి ఎంతవరకూ వీరి వ్యూహం ఫలిస్తిందో…

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -