- Advertisement -

ఈ భామ‌కు ప్ర‌భాస్ ఎవ‌రో తెలియ‌ద‌ట‌..!

- Advertisement -

బాహుబ‌లి సినిమా రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు ఇండియా మొత్తం క్రేజ్ సంపాదించుకున్నాడు మ‌న యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌.ఇండియాల‌నే అత్య‌ధిక క‌లెక్ష‌న్లు సాధించిన హీరోగా రికార్డు క్రియేట్ చేశాడు ప్ర‌భాస్‌.అయితే ఇది జీర్ణించుకోలేని బాలీవుడ్ జ‌నాలు ,ఎప్పటిక‌ప్పుడు మ‌న హీరోల‌ను త‌క్కువ చేసి మాట్లాడుతునే ఉంటున్నారు.తాజాగా అలాంటి సంఘ‌ట‌నే ఒకటి జ‌రిగింది.బాలీవుడ్ లో ‘లవ్ యాత్రి’ సినిమాలో నటిస్తోన్న హీరో హీరోయిన్లు ఆయుష్ శర్మ, వరీనా హుస్సేన్. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రమోషన్స్ లో భాగంగా చిత్రబృందం హైదరాబాద్ కి వచ్చింది.విలేకర్లకి హీరోయిన్ వరీనా హుస్సేన్ కి మధ్య జరిగిన సంభాషణలో ఆమె ప్రభాస్ ఎవరో తెలియదన్నట్లు ముఖం పెట్టింది. నాకు ప్ర‌భాస్ ఎవ‌రో తెలియ‌ద‌ని చెప్పి మీడియాకు షాక్ ఇచ్చింది ఈ భామ‌.అయితే ఆయుష్ శర్మ ఆఫ్ఘనిస్తాన్ అమ్మాయని,ఆమెకు ప్ర‌భాస్ ఎవ‌రో నిజంగా తెలియ‌ద‌ని సినిమా హీరో ఆయుష్ శర్మ తెల‌ప‌డంతో స‌మస్య కాస్తా స‌ర్దుమ‌ణిగింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -