సూపర్ స్టార్ మహేశ్‌బాబుతో టాలీవుడ్ కమర్షియల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. అవును ఈ విషయాన్ని స్వయంగా బోయపాటి శ్రీనునే ఓ ఇంటర్య్వూలో చెప్పాడు.మొదట బాలకృష్ణతో సినిమా చేసిన తరువాత మహేశ్‌తో సినిమా ఉంటుందని చెప్పాడు బోయపాటి. అయితే బోయపాటితో మహేశ్ సినిమా అంటే మాత్రం ఫ్యాన్స్ భయపడిపోతున్నారు. బోయపాటి సినిమాలలో హింస,రక్తపాతం ఎక్కువుగా ఉంటోంది.పైగా బోయపాటి కథలన్ని ఒకేలా ఉంటున్నాయి అనే విమర్శ కూడా ఉంది.
తాజాగా బోయపాటి దర్శకత్వం వహించిన వినయ విధేయ రామ సినిమపై నెగిటివ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. సినిమాను చూసిన చరణ్ ఫ్యాన్స్ సైతం బోయపాటిని తిడుతున్నారు. మరి ఇటువంటి పరిస్థితులలో మహేశ్ బోయపాటితో సినిమా చేస్తే అంతే సంగతలని ఫ్యాన్స్ భయపడుతున్నారు.పైగా మహేశ్ సినిమాకు ఫ్యామిలీ ఆడియోన్స్ కూడా థియోటర్లకు వచ్చి సినిమా. బోయపాటితో సినిమా చేస్తే ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియోన్స్ దూరం అవుతారని మహేశ్ ఫ్యాన్స్ భయపడిపోతున్నారు. మహేశ్ ప్రస్తుతం తన 25వ సినిమా మహర్షి షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమ తరువాత సుకుమార్‌తో ఓ సినిమా చేయనున్నాడు మహేశ్. మరి ఇటువంటి పరిస్థితులలో బోయపాటితో మహేశ్ సినిమా ఉంటుందో లేదో చెప్పడం కష్టమే.
- కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
- రిపేర్ అని ఆపాడు.. ప్రాణం తీశాడు!
- స్టీల్ ప్లాంట్ కార్మికులకు అండగా జగన్
- లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా కన్నుమూత !
- రజినీకాంత్ నెక్స్ట్ లెవెల్ స్కెచ్!
