Tuesday, May 14, 2024
- Advertisement -

పాతికేళ్లయ్యింది.. థియేట‌ర్‌కు వెళ్లి

- Advertisement -

ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన బ్ర‌హ్మానందం

పాతికేళ్లుగా.. సినిమా థియేట‌ర్‌కు వెళ్ల‌లేద‌ని.. తాను న‌టించిన సినిమాలు కూడా చూడనని హాస్య న‌టుడు బ్ర‌హ్మానందం ప్ర‌క‌టించారు. త‌న‌కు సినిమాలు వెగ‌టుగా క‌నిపిస్తున్నాయ‌ని.. సినిమాలపై వెగ‌టు వ‌చ్చి చివరకు తాను యాక్ట్ చేసిన సినిమాలు కూడా చస్తే చూడనని ప్ర‌క‌టించారు. థియేటర్‌కు వెళ్లి తాను సినిమాలు చూసి పాతికేళ్లు అయ్యిందన్న ఇటీవ‌ల ఓ మీడియా ఇంట‌ర్వ్యూలో పేర్కొరు. ఈ లెక్కన రాజమౌళి బాహుబలి సినిమా కూడా బ్రహ్మీ చూడలేదా? అనే సందేహం రాక మానదు. వెండితెర మీద కాకుంటే.. ఇంట్లో హోం థియేటర్‌లో చూసి ఉండొచ్చేమో.

సినిమాలు చూడకపోవడ‌మే కాదు.. ఇంట్లో వాళ్లు ఫలానా సినిమా చూద్దామని అడిగాడ‌ట‌. సినిమా ఎందుకనో త‌న అసహజంగా క‌నిపిస్తోంద‌ని న‌టించే వ్య‌క్తే అలా అన‌డం అంద‌రికీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. నటన తన వృత్తి కాబట్టి.. చేసే పనిని అస్వాదిస్తున్నా అంతే కానీ థియేట‌ర్‌లో సినిమాను చూడడం నిజంగా త‌న‌కు ఇబ్బందని పేర్కొన్నారు.

అయితే ఈ విధంగా అభిప్రాయం రావ‌డానికి ఓ సంఘ‌ట‌న వివ‌రించారు. ఒకసారి ఫ్రెండ్స్‌తో కలిసి సినిమాకు వెళ్లాడు. సినిమాలో ప్రేమలో విఫలమై మందుబాటిల్ పట్టుకొని ఓ వ్య‌క్తి పాట పాడుతుంటాడు. మధ్యలో ఎఫెక్ట్ కోసం దగ్గుతూ.. మళ్లీ పాట అందుకుంటాడు. తాను ఆ సీన్‌ను చాలా సీరియస్‌గా చూస్తున్నప్పుడు.. పక్కనున్నోడు మాత్రం.. అంత దగ్గుగా ఉన్నప్పుడు పాట పాడడం ఎందుకు? డాక్టర్ దగ్గరకు పోయి మందు తీసుకొని రావొచ్చుగా? అని వ్యాఖ్యానించాడంట‌. ఆ మాటతో బ్రహ్మనందం ప‌గ‌ల‌బ‌డి న‌వ్వాడట‌.

అప్పటి నుంచి తాను థియేట‌ర్‌లో ఏం చూసినా.. ప్రతిదీ అసహజంగానే అనిపిస్తుందని చెప్పుకొచ్చారు. బ్యాక్‌గ్రౌండ్‌లో మ్యూజిక్ రావడం.. అందరూ ఒకేరకమైన దుస్తులు వేసుకొని డ్యాన్స్‌లు చేయటం.. లాంటి ప్రశ్నలు వేసుకుంటూ కూర్చుంటే సినిమాను ఎంజాయ్ చేయలేం కదా? అని ప్ర‌శ్నించారు. అందుకే తాను సినిమాను చూడనని పేర్కొన్నారు. ఎప్పుడైనా చూడాలనిపిస్తే నాటకాలు చూస్తానని.. ఒకసారి రవీంద్రభారతికి వెళ్లి.. పక్కగా నిలుచొని ఒక నాటకం చూసి వస్తాన‌న్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -