Thursday, April 25, 2024
- Advertisement -

‘ఆచార్య’ టెంపుల్ సెట్ ఓ మహా అద్భుతం : చిరంజీవి

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి పదేళ్ల విరామం తర్వాత ఖైదీ నెంబర్ 150 చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత దేశభక్తి నేపథ్యంలో సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటించారు. ప్రస్తుతం ప్రముఖ దర్శకులు కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం లాక్ డౌన్ కి ముందు రిలీజ్ కావాల్సి ఉన్నా.. కరోనా కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం షూటింగ్ షరవేగంగా జరుపుకుంటుంది. తాజాగా ఈ చిత్రం కోసం హైదరాబాద్ శివార్లలోని కోకాపేటలో భారీ టెంపుల్ టౌన్ సెట్ వేశారు.

భారత సినీ చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా 20 ఎకరాల్లో ఈ సెట్ వేశారు. దీనికి సంబంధించిన వ్యూజువల్స్ మెగాస్టార్ స్వయంగా రిలీజ్ చేసి ఇది ఓ అద్భుత రూప కల్పన అని పొగిడారు. ఆచార్య సినిమా కోసం ఇండియాలోనే అతి పెద్ద టెంపుల్ టౌన్ సెట్ 20 ఏకరాల్లో వేశారని.. అందులో భాగంగా గాలి గోపురం… ఆశ్చర్యం గొలిపేలా ప్రతి దాన్ని అద్భుతంగా మలిచారు. 

ఇంత అద్భుతమైన కళాకండాన్ని ఏర్పాటు చేసిన రూపొందించిన కళా దర్శకులు సురేశ్ ని, ఈ టెంపుల్ టౌన్ ను విజువలైజ్ చేసిన డైరెక్టర్ కొరటాల శివని, దీన్ని ఇంత అపురూపంగా నిర్మించడానికి అవసరమైన వనరులను ఇచ్చిన నిర్మాతలు నిరంజన్ రెడ్డి, రాంచరణ్ లను నేను మనస్పూర్తిగా అభినందిస్తున్నాను అన్నారు. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -