Sunday, May 5, 2024
- Advertisement -

కోర్టు మెట్లెక్కిన రామ్ చ‌ర‌ణ్ విల‌న్‌…

- Advertisement -

ఒకప్పుడు ప్రేమ కథలు, రొమాంటిక్, ఎమోషనల్ చిత్రాలతో న‌టించి మంచి క్రేజ్ సంపాదించుకున్న నటుడు అరవింద స్వామి. ప్రస్తుతం కీలక పాత్రలు చేస్తూనే క్యారెక్టర్ రోల్స్ లో కూడా చేస్తున్నారు. లుగు రీమేక్ రాంచరణ్ ధృవ చిత్రంలో కూడా అరవింద స్వామే విలన్. అయితే తాజాగా నిర్మాత‌తో వివాదం కార‌నంగా కోర్టు మెట్లు ఎక్కారు.

ఓ సినిమాకు సంబంధించి తనకు ఇవ్వాల్సిన పారితోషకాన్ని నిర్మాత ఇవ్వకపోవడంతో ఆయన మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ప్రముఖ హాస్య నటుడు మనోబాల నిర్మాణంలో 2014 లో చతురంగ వెట్టై చిత్రం వచ్చింది. ఆ చిత్రం మంచి విజయం సాధించింది. దీనితో ఆ చిత్రానికి సీక్వెల్ చతురంగ వెట్టై 2 ని కూడా ఆయనే నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అరవింద స్వామి, త్రిష ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

చతురంగ వెట్టై చిత్రం అన్ని కార్యక్రమాలని పూర్తి చేసుకుని సెప్టెంబర్ 22 న విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రానికి సంబంధించి పూర్తి పార‌తోషికాన్ని నిర్మాత ఇవ్వ‌క‌పోవ‌డంతోనే ఆర‌వింద స్వామి కోర్టుమెట్లు ఎక్కారు. సినిమా విడుదల దగ్గరపడుతున్న సమయంలో అరవింద స్వామి కోర్టుకు ఎక్కడంతో చతురంగ వెట్టైపై సందిగ్దత నెలకొంది.

ఈ చిత్రానికి సంబంధించి ఒప్పందంలో భాగంగా మనోబాలా తన క్లయింట్ కు ఇంకా రూ.1.79 కోట్లు చెల్లించాల్సి ఉందని అర‌వింద స్వామి త‌రుపు న్యాయ‌వాది పేర్కొన్నారు. ఈ విషయమై ఎన్నిసార్లు సంప్రదించినా స్పందించకపోవడంతో కోర్టుకు ఆశ్రయించామన్నారు. తమకు ఇవ్వాల్సిన మొత్తాన్ని 18 శాతం వడ్డీతో చెల్లించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశామన్నారు. ఈ మొత్తం చెల్లించేవరకు సినిమా విడుదల ఆపేయాలని కోర్టుని కోరాడు

మరోవైపు అరవింద స్వామి దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.సుందర్ అరవిందస్వామి పిటిషన్ తో కోర్టు మనోబాలకు నోటీసులు పంపింది. ఈ విషయమై సెప్టెంబర్ 20 లోపు స్పందించాలని నోటీసులో సూచించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -