రణ్‌వీర్ ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం ధురంధర్ 2. రేపు హోలీ సందర్భంగా విడుదలవుతుందని పలువురు జాతీయ, బాలీవుడ్ మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేశాయి. అయితే ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ మరియు విమర్శకుడు తరుణ్ ఆదర్శ్ ఈ వార్తలను ఖండించారు.
ట్రైలర్ విడుదలపై తాము సిద్ధమైనప్పుడు మాత్రమే అధికారిక ప్రకటన చేస్తామని జియో స్టూడియోస్ నుంచి సమాచారం అందిందని ఆయన వెల్లడించారు. అందువల్ల అభిమానులు మరికొంత కాలం వేచి చూడాల్సి ఉంటుంది.
ధురంధర్ 2 మార్చి 19, 2026న థియేటర్లలో విడుదల కానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ చిత్రంలో అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, సారా అర్జున్, డానిష్ పాండోర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ట్రైలర్‌పై ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
