- Advertisement -

మెగాస్టార్‌తో సినిమాపై ‘రంగ‌స్థ‌లం’ డైరెక్ట‌ర్ కామెంట్‌

- Advertisement -

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో సినిమా సంద‌డి ఏర్ప‌డింది. ఈ సంద‌డికి సుకుమార్ దర్శ‌క‌త్వంలో రూపొందించిన ‘రంగ‌స్థ‌లం’ తొలి బోణి కొట్ట‌నుంది. రామ్‌చ‌ర‌ణ్‌, స‌మంత‌తో గ్రామీణ నేప‌థ్యంలో తెర‌కెక్కించిన ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకొని దూసుకెళ్తోంది. మ‌రీ సినిమా ఎలా ఉంటుందో మార్చి 30వ తేదీన తెలుస్త‌ది. అయితే ఈ సినిమా ద‌ర్శ‌కుడు చిరంజీవి సినిమాపై ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ప్ర‌క‌టించాడు.

‘రంగ‌స్థ‌లం’ సినిమా ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో భాగంగా ఇటీవ‌ల మీడియాతో సుకుమార్ మాట్లాడాడు. అయితే చిరంజీవి 152 సినిమా సుకుమార్ చేయ‌నున్నాడ‌ని ఆ మ‌ధ్య పుకార్లు వ‌చ్చాయి. ఈ విష‌య‌మై సుక్కును ప్రశ్నించ‌గా అలాంటిదేమీ లేదు అని ప్ర‌క‌టించాడు. చిరంజీవిగారి 152వ చిత్రాన్ని నేను డైరెక్ట్‌ చేస్తున్నాననే వార్తలో నిజం లేదు. అయినా నాకు ఒక కథ రాసుకోవడానికి, సినిమా తీయడానికి చాలా సమయం పడుతుంది. అలాంటిది చిరంజీవిగారి సినిమా అంటే వామ్మో అనేశాడు. ఇంకా తాను ఏ కథా సిద్ధం చేసుకోలేదు. ప్రస్తుతం త‌న మనసంతా ‘రంగ‌స్థ‌లం’ చుట్టూనే తిరుగుతుంది అని తెలిపాడు. ముందు ‘రంగ‌స్థ‌లం’ నుంచి తాను బయటపడాలి.. కొంత సమయం విశ్రాంతి తీసుకున్న త‌ర్వాత సినిమాల గురించి ఆలోచిస్తా! అని ప్ర‌క‌టించాడు. మొత్తానికైతే మెగాస్టార్‌తో సినిమా వాస్తవం కాదు అని స్ప‌ష్టం చేశాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -