తమిళ స్టార్ హీరో విజయ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా జన నాయగన్. ఈ సినిమా రిలీజ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాకపోయినా, చిత్రబృందం 2026 మార్చి 19న విడుదల చేయాలని భావిస్తున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. దీంతో అభిమానులు ఈ తేదీపై పెద్ద ఎత్తున చర్చలు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు సినిమా చూడటానికి ఒక రివిజన్ కమిటీ సమావేశం కావాల్సి ఉంది. కమిటీ సభ్యుల్లో ఒకరు అనారోగ్యానికి గురైన కారణంగా ఈ రోజు సినిమా సమీక్ష జరగడం లేదని తెలుస్తోంది. దీంతో రివిజన్ కమిటీ సమావేశం వాయిదా పడే అవకాశం ఉంది. ఇదే నిజమైతే, మార్చి 19న సినిమా విడుదల కావడం కూడా సందేహంగా మారింది.
ఈ చిత్రానికి వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా, సంగీతాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ అందిస్తున్నారు.
