బాలీవుడ్ హీరోయిన్ కియరా అద్వానీ మహేశ్ బాబు నటించిన భరత్ అను నేను సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో తెలుగులో వరస ఆఫర్లు వస్తున్నాయి.ప్రస్తుతం ఆమె తెలుగులో రామ్ చరణ్ చేస్తున్న సినిమాలో హీరోయిన్‌గా చేస్తుంది. ఈ సినిమాకు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నాడు.అయితే బోయపాటిపై కియరా సంచలన కామెంట్స్ చేసింది.ఆయన(బోయపాటి) నన్ను బాగా ఏడిపిస్తున్నాడని తెలిపింది.సినిమాలో హీరోయిన్ పాత్రకు ఓ ఎమోషనల్ సీన్ ఉంటుందట.
దానికి కోసం కియారా ఏడవాల్సిఉంటుంది. ఆ సీన్ లో పెర్ఫెక్షన్ కోసం బోయపాటి ఆమెను 32 సార్లు ఏడిపించాడట. ఈ విషయాన్ని స్వయంగా కియారా చెప్పుకొచ్చింది.సినిమాలో కీలకమైన ఆ సీన్ కోసం తను 32 టేక్స్ తీసుకున్నానని, డైరెక్టర్ అన్ని సార్లు ఏడిపించి అప్పుడు ఫైనల్ చేశారని చెప్పుకొచ్చింది. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నారు.ఇక అటు బాలీవుడ్‌లో కియరా వరస ఆఫర్లతో దూసుకుపోతుంది.
