Sunday, May 5, 2024
- Advertisement -

ప్చ్ వ‌చ్చాయ్‌.. వెళ్లాయ్‌

- Advertisement -
  • గ‌త‌వారం సినిమాల ఫ‌లితం
  • బాక్సాఫీస్‌కు వ‌సూళ్లు నిల్‌
  • నానిపైనే థియేట‌ర్ల ఎదురుచూపులు

వ‌రుస‌పెట్టి సినిమాలొస్తున్నాయ్‌… అదే స్పీడ్‌గా థియేట‌ర్ల నుంచి వెళ్లిపోతున్నాయ్‌. రెండు నెల‌ల నుంచి సినిమా ప‌రిశ్ర‌మ‌కు ఇదే ప‌రిస్థితి. సినిమాలు ప‌దుల సంఖ్య‌లో వస్తున్నా ప్రేక్ష‌కులు సినిమా థియేట‌ర్‌లోకి రావ‌డం లేదు. వ‌చ్చేందుకు ఆస‌క్తి చూప‌డం లేదు. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు చివ‌రి విజ‌యం అంటే గ‌రుడ‌వేగ అనే చెప్పుకోవాలి.

గ‌త నవంబర్ నెలలో దాదాపు 40 సినిమాలు వ‌చ్చాయి. అయితే చెప్పుకోతగ్గ విజయాలు లేక బాక్సాఫీస్ గ‌ల్లాపెట్టే నిండ‌లేదు. ఆ సినిమాల‌తో తెలుగు సినీ మార్కెట్‌కి వ‌సూళ్లు అస్స‌లు రాలేదు. ఈ నేప‌థ్యంలో మెగా అల్లుడు సాయిధరమ్‌తేజ్ జ‌వాన్‌గా వ‌చ్చి ప‌రిశ్ర‌మ‌కు వ‌సూళ్లు తీసుకొస్తాడ‌నుకుంటే నిరాశే మిగిల్చాడు. ఈ సినిమా గురించి ఇప్పుడు ఎవ‌రూ మాట్లాడుకోవ‌డం లేదు. ఇక గోపీచంద్‌ సినిమా ఆక్సిజ‌న్ ప‌రిశ్ర‌మ‌కు వాయువుగా మారుతుంద‌నుకుంటే అది అంతే.

రెండు సినిమాల‌కు మొదటి రోజు సంతృప్తికర వసూళ్లు.. మంచి టాక్ వచ్చింది. కానీ ఆ తర్వాత రెండిటి వసూళ్లు పడిపోయాయి. ఆక్సిజన్‌కు నెగ‌టివ్ టాక్ రావ‌డంతో థియేట‌ర్ల‌కు ఎవ‌రూ రావ‌డం లేదు.
సాయిధరమ్‌ తేజ్‌ జవాన్‌కి అంతంతే స్పంద‌న ఉంటోంది. బిచ్చ‌గాడుతో ఆక‌ట్టుకున్న విజ‌య్ ఆంటోని ఇంద్రసేన డ‌బ్బింగ్‌తో వ‌చ్చి అట్ట‌ర్‌ఫ్లాప్ మూట‌గ‌ట్టుకున్నాడు. ఈ సినిమా ఫ‌లితాలు ఇలా ఉండ‌డంతో బయ్యర్లు ఆందోళ‌న‌లో ప‌డ్డారు.

డిసెంబర్ 21వ తేదీ వరకు తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు భారీ సినిమాలు లేవు. ఇలాంటి పరిస్థితి ఇంకొన్ని రోజులు ఉండేట్టు తెలుస్తోంది. ఆశ‌ల‌న్నీ నాని మిడిల్‌ క్లాస్‌ అబ్బాయిపై అంచ‌నాలు ఉన్నాయి. ఇక హలోపై అంచ‌నాలు ఉన్నా అంతంతే.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -