- Advertisement -
మోహన్ బాబు వైసీపీలో చేరిన తర్వాత టీడీపీనేతలు విమర్శలు సంధిస్తున్నారు. టీడీపీ నేత బుద్ధా వెంకన్న గత మూడు, నాలుగు రోజులుగా.. సినీనటుడు, వైసీపీ నేత మోహన్ బాబుపై తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. బుద్దా వ్యాఖ్యలకు మంచు విష్ణు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.
వెంకన్నగారూ.. నోరు ఉంది కదాని ఊరికే పారేసుకోకండి. ఎన్నికలు ఉండేది ఇంకో పది రోజులే. ఆ తర్వాత మీరు మా ఇంటికి రావాలి. మేము మీ ఇంటికి రావాలి. ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవాలి. ఎన్నికల్లో మీరు విమర్శించొచ్చు.. మేమూ మిమ్మల్ని విమర్శించొచ్చు. కానీ మర్యాద ఉండాలి. అన్నింటికీ హద్దు ఉంటుంది. నెల రోజుల ముందు తిరుపతికి వచ్చి మీరు మా ఇంట్లో కూర్చుని ఏం మాట్లడారో మర్చిపోకండి’ అని ట్వీట్ చేశారు.
