Saturday, May 4, 2024
- Advertisement -

వీకెండ్ సంద‌డి లేకుండా.. బోర్‌గా.. థియేట‌ర్ల బంద్‌

- Advertisement -

అరె మావ సండే సినిమాకు పోదామనుకుంటే ఇట్లాయ్యింది ఏమిటిరా అని ఓ యువ‌కుడు.. డాడీ సినిమాకు తీసుకెళ్తాడ‌ని ఆశ‌ప‌డిన ఓ బాలుడు.. హాయిగా ఇంటిల్లిపాది సినిమాకు పోదామ‌నుకుంటే నిరాశ‌లో ఓ కుటుంబం.. ఇలా ఈ వీకెండ్ బోరింగ్‌గా వెళ్లిపోయింది. ఎందుకంటే సినిమా థియేట‌ర్లు మూత‌ప‌డ‌డమే కార‌ణం. తెలుగు ప్ర‌జ‌లు సినీ ప్రియులు. వారంలో ఒక సినిమా చూడాల్సిందే అనే భావ‌న చాలామందిలో ఉంటుంది. అందుకే త‌మ బిజీ షెడ్యూల్‌లోనూ సినిమాకు ఓ నాలుగైదు గంట‌లు స‌మ‌యం ఇస్తారు. ఇక వారికి దొరికేది శ‌ని, ఆదివారాల్లే. ఈ స‌మ‌యంలో సినిమాకు పోదామంటే ఇగో థియేట‌ర్లు మూత‌ప‌డ‌డంతో నిరాశ‌కు గుర‌య్యారు.

డిజిటల్ ప్రొవైడర్లు ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ద‌క్షిణ సినిమా ప‌రిశ్ర‌మ శుక్ర‌వారం నుంచి ప్రారంభ‌మైన థియేటర్ల బంద్ ఇంకా కొన‌సాగుతోంది. ఆదివారానికి మూడో రోజుకు చేరుకుంది. శ‌ని, ఆదివారం థియేట‌ర్లు మూసి ఉండ‌డంతో ప్ర‌జ‌లు వినోదానికి దూర‌మ‌య్యారు. గ్రేటర్ హైదరాబాద్‌లో సినిమా థియేట‌ర్ల వ‌ద్ద సంద‌డి వాతావ‌ర‌ణం లేక‌పోయింది. వీకెండ్‌లో అలా సినిమాకు పోయి బిర్యానీ తిని అలా హైద‌రాబాద్ అందాల‌ను చూద్దామ‌నుకునే వారు ఇంట్లోనే కూర్చుండిపోయారు.

వీకెండ్‌లో ప్రేక్షకులతో కళకళలాడే థియేటర్లు బోసిపోయాయి. నిర్మాతల మండలి నిర్ణయంతో.. థియేటర్లు బంద్ పాటిస్తున్నారు యజమానులు. బంద్ ఎఫెక్ట్ తో శుక్రవారం విడుద‌ల‌య్యే సినిమాలు వాయిదా పడ్డాయి. మరోవైపు వారాంతంలో వీకెండ్ అయిన శని, ఆది వారాల్లోనే బాక్సాఫీస్ కలెక్షన్స్ బాగా ఉంటాయి. ఈ బంద్ కారణంగా ఫస్ట్ టైమ్ వీకెండ్ జోష్ లేకుండా థియేటర్లు బోసిపోయాయి.

అసలే ఫస్ట వీక్..అందులోనూ షాపింగ్ .. ఫస్ట్ షో సినిమా అంటూ హైద‌రాబాద్‌వాసులు అలవాటు పడిపోయారు. ఇప్పుడు ఈ బంద్ కారణంగా బోర్ కొట్టేసి ఇంట్లోనే ఉండిపోయారు. బంద్ కారణంగా సినీ ప‌రిశ్ర‌మ‌కు తీవ్ర న‌ష్టంతో పాటు దానిపై ఆధార‌ప‌డిన వారిపై కూడా తీవ్ర ప్ర‌భావం ప‌డింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -