Thursday, April 25, 2024
- Advertisement -

తెలంగాణలో థియేటర్లు ఓపెన్..!

- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో కరోనా సెకండ్ ప్రభావం క్రమక్రమంగా తగ్గుతోంది. నిన్న రాష్ట్రంలో 1556 కోవిడ్ పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. వైరస్ వ్యాప్తి తగ్గడంతో రాష్ట్రంలో లాక్ డౌన్ సడలింపులు కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అందరూ థియేటర్లు ఎప్పుడు ఓపెన్ చేస్తారా అని ఎదురు చూస్తున్నారు. కరోనా మొదటి వేవ్ లో లాక్ డౌన్ సడలింపులు ముగియగానే 50 శాతం ఆక్యుపెన్సీ తో థియేటర్లను ప్రారంభించారు.

ఈ ఏడాది మార్చి ఆఖరు లో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభం కాగా, ఏప్రిల్ ఆఖరి నుంచి లాక్ డౌన్ ప్రారంభించారు. అప్పటికి పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ థియేటర్లలో ఆడుతుండడంతో కొద్దిరోజులపాటు ఆ సినిమా ఆడుతున్న థియేటర్లకు మినహాయింపు ఇచ్చారు. ఆ తర్వాత వాటిని కూడా మూసివేశారు. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి మెల్లమెల్లగా తగ్గుతుండటంతో తెలంగాణ రాష్ట్రంలో జులై 1వ తేదీ నుంచి థియేటర్లు ఓపెన్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. 50 శాతం ఆక్యుపెన్సీ తో ప్రారంభిస్తారని సమాచారం.

ఆంధ్రప్రదేశ్ లో కూడా థియేటర్లను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొంచెం ఎక్కువగానే ఉంది. నిన్న ఏపీలో 5,741 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో ఇంకా పాజిటివ్ కేసులు తగ్గిన తర్వాత థియేటర్లను ప్రారంభించే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ప్రారంభమైతే నారప్ప, ఖిలాడి, లవ్ స్టోరీ వంటి సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వకీల్ సాబ్ సినిమాను కూడా రీ రిలీజ్ చేసేందుకు దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నారు.

Also Read

రాయలసీమ బ్యాక్​డ్రాప్ లో రవితేజ మూవీ..!

బుల్లితెరపై తమన్నా.. ఏ షోకో తెలుసా?

కియారా అద్వానీ కిక్.. వైరల్ వీడియో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -