Monday, May 13, 2024
- Advertisement -

‘ఎన్టీఆర్‌’ సినిమా గొడవ రాజుకుంది

- Advertisement -

నిజ జీవిత కథలతో సినిమా తీయడం సాహసంతో కూడుకున్న విషయమే. డ్రామా లేకుంటే సినిమా పండదు. అందుకోసం ఏదో ఒక మసాలా వేయాల్సిందే. ఎవరో ఒకరిని ప్రతికూలంగా చూపించాల్సిందే. కానీ ఆ వ్యక్తుల కుటుంబీకులు దాన్ని తేలిగ్గా తీసుకోరు. ఎంతో జాగ్రత్తగా తీసిన ‘మహానటి’ విషయంలోనూ జెమిని గణేశన్ పాత్రను చిత్రించిన తీరు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఆయన తనయురాలు ఈ సినిమాపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక తెలుగులో తెరకెక్కుతున్న మరో మెగా బయోపిక్ ‘ఎన్టీఆర్’ ఎంత చిచ్చు రాజేస్తుందో అన్న సందేహాలు ముందు నుంచి ఉన్నాయి. ఈ చిత్రంలో ఎవరెవరిని విలన్లుగా చూపిస్తారనే విషయంలో ఆసక్తికర చర్చ నడుస్తోంది.

చిత్ర వర్గాల సమాచారం ప్రకారం ఎన్టీఆర్‌ తొలిసారి ముఖ్యమంత్రి అయినపుడు.. దొడ్డి దారిలో ఆయన్ని పదవి నుంచి తప్పించి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న నాదెండ్ల భాస్కర రావే ఇందులో విలన్ అంటున్నారు. ఈ పాత్రలో బాలీవుడ్ నటుడు సచిన్ ఖేద్కర్ నటిస్తారని కూడా వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాదెండ్ల కుటుంబం అప్రమత్తమైంది. ఈ చిత్రాన్ని ఆపేయాలంటూ నిర్మాత, హీరో నందమూరి బాలకృష్ణకు నోటీసులు జారీ చేసింది. ఈ సినిమాకు సంబంధించి తమ కుటుంబ సభ్యులెవరినీ బాలయ్య అండ్ కో కలవలేదని.. సినిమాలోని ఏ పాత్రకు సంబంధించి తమ అనుమతి కూడా తీసుకోలేదని నాదెండ్ల కుటుంబ సభ్యులు తెలిపారు. సినిమాలో నాదెండ్లను చెడుగా చూపిస్తే ఊరుకోమని.. అసలు ఈ సినిమా తెరకెక్కడానికే వీల్లేదని వాళ్లు నోటీసులో పేర్కొన్నారు. మరి దీనిపై బాలయ్య బృందం ఎలా స్పందిస్తుందో.. నోటీసులకు ఎలా బదులిస్తుందో.. మున్ముందు ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. మరోవైపు లక్ష్మీపార్వతి పాత్ర సినిమాలో ఉంటుందా.. ఉంటే ఆమెను ఎలా చూపిస్తారు అన్నది కూడా ఆసక్తికరమే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -