Thursday, April 25, 2024
- Advertisement -

శివాజీ రాజాకు షాక్.. న‌రేశ్‌ ప్యానెల్‌కు మ‌ద్ద‌తు తెలిపిన నాగ‌బాబు

- Advertisement -

మూవీ ఆర్టిస్టు అధ్య‌క్ష‌ ఎన్నికలు రసవత్తవ‌రంగా మారాయి. ఈ నెల 10 మా అధ్య‌క్ష‌ ఎన్నికలు జ‌ర‌గ‌నున్న సంగ‌తి అంద‌రికి తెలిసిందే. ప్ర‌స్తుతం మా అధ్య‌క్షుడు శివాజీ రాజా మ‌రోసారి అధ్య‌క్షుడిగా పోటీ చేస్తుండ‌గా , అతనికి ప్ర‌త్య‌ర్థిగా న‌టుడు న‌రేశ్ పోటీ చేస్తున్నారు. గ‌త రెండు, మూడు రోజులు నుంచి మీడియాకెక్కి మ‌రి వీరు ఒక‌రిపై మ‌రోక‌రు విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. టాలీవుడ్‌లోని ప్రముఖులు అంద‌రు శివాజీ రాజా ప్యానెల్లో ఉండ‌గా, న‌రేశ్ ప్యానెల్లో జీవిత , రాజ‌శేఖ‌ర్‌లు మాత్ర‌మే ఉన్నారు. మా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీ చేసే రెండు వ‌ర్గాలు మెగాస్టార్ చిరంజీవిని క‌లిశాయి. అయితే త‌న మ‌ద్ద‌తు రెండు వ‌ర్గాల‌కు ఉంటుంద‌ని, గెలిచిన‌వారికి నేను మ‌ద్ద‌తు ఇచ్చిన‌ట్లు భావించాల‌ని చిరు చెప్పిన‌ట్లుగా ఈ రెండు వ‌ర్గాలు తెలిపాయి.

అయితే చిరంజీవి మ‌న‌స్సులో మాత్రం మ‌ళ్లీ శివాజీ రాజా అయితేనే బాగుంటుంద‌ని ఉంద‌ట‌. సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు కావాలి అంటే శివాజీ రాజా మ‌ళ్లీ మా అధ్య‌క్షుడుగా ఎన్నిక అయితే చూడాల‌ని చిరు మ‌న‌స్సులో ఉంద‌ని ఆయ‌న స‌న్నిహితులు తెలిపారు. కాని వీరంద‌రికి షాకిచ్చాడు మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు. స‌డ‌న్‌గా న‌రేశ్ ప్యానెల్‌కు త‌న మ‌ద్ద‌తు తెలిపి శివాజీ రాజా వ‌ర్గానికి షాకిచ్చాడు. అయితే నాగ‌బాబు ఆలోచ‌న వేరేలా ఉంద‌ని తెలుస్తోంది.మూవీ ఆర్టిస్టుల సంఘంలో ఎవరూ ఏడాదికి మించి పదవులు చేపట్టకూడదని ఫ్రెష్ బ్లడ్ రావాల్సిందేనని నాగబాబు అభిప్రాయపడ్డారు. అందుకే నేను కూడా ఒక సంవ‌త్స‌రం మాత్ర‌మే చేసి త‌ప్పుకున్నాను. నన్ను మ‌ళ్లీ అధ్య‌క్ష ప‌దవి చేప‌ట్ట‌మ‌ని అడిగిన నేను విముఖ‌త చూపించాన‌ని తెలిపాడు. మా ఎన్నిక‌ల్లో మ‌హిళ‌ల‌కు కూడా స‌ముచిత స్థానం క‌ల్పించాలి అని ఆయ‌న ఈ సంద‌ర్బంగా కోరారు. మహిళలలకు కేవలం ఈసీ మెంబర్లుగా అవకాశం ఇస్తే సరిపోదని ,వారిని కూడా అధ్య‌క్ష‌, ప్రధాన కార్యదర్శిలుగా ఎన్నుకుంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని వెల్ల‌డించారు.

నరేష్ ప్యానెల్ లో జీవితను ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేసుకోవడం హర్షనీయం. అలాగే హీరో రాజశేఖర్ ఈ ప్యానల్లో చేరికతో కొత్త ఆలోచనలకు ఆస్కారం ఏర్పడుతోంది.దీని బ‌ట్టి చూస్తుంటే మెగావారి మ‌ద్ద‌తు న‌రేశ్ ప్యానెల్‌కే అని తెలిసిపోతుంద‌ని చాలామంది చ‌ర్చించుకుంటున్నారు.గ‌తంలో నాగ‌బాబు న‌టుడు రాజేంద్ర‌ప్ర‌సాద్‌కు మ‌ద్ద‌తు తెలిపి , ద‌గ్గ‌రుండి అత‌ని విజ‌యానికి దోహ‌దం చేశారు. మ‌రి ఇప్పుడు న‌రేశ్‌కు కూడా ఎలాంటి స‌హయం చేస్తారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -