Sunday, May 12, 2024
- Advertisement -

ఎన్టీఆర్‌తో బాల‌య్య మొద‌టిసారి ఎప్పుడు మాట్లాడాడో తెలుసా?

- Advertisement -

నంద‌మూరి కుటుంబంలో మొన్న‌టి వ‌ర‌కు లుక‌లుక‌లు ఉన్న సంగ‌తి తెలిసిందే.జూనియ‌ర్ ఎన్టీఆర్‌ బాల‌య్యల మ‌ధ్య స‌రైన మాట‌లు లేవు.కాని హరికృష్ణ మ‌ర‌ణంతో బాలయ్య హ‌రికృష్ణ కుటుంబానికి ద‌గ్గ‌రైయ్యారు.దీనిలో భాగంగానే ఎన్టీఆర్ న‌టించిన అర‌వింద స‌మేత స‌క్సెస్ మీట్‌కు బాల‌య్య ముఖ్య అతిథిగా వ‌చ్చారు.అయితే బాల‌య్య ఎన్టీఆర్ మొట్ట మొద‌టిసారిగా ఎప్పుడు మాట్లాడారో చెప్పాడు పరుచూరి గోపాలకృష్ణ .బాలకృష్ణ తనకి సొంత బాబాయ్ అయినప్పటికీ తారక్ మాత్రం అతడితో మాట్లాడడానికి భయపదేవాడట. అతడి భయాన్ని గ్రహించి పరుచూరి గోపాలకృష్ణ స్వయంగా బాలయ్యతో మాట్లాడించిన సందర్భాన్ని ‘పరుచూరి పలుకులు’ షోలో గుర్తు చేసుకున్నారు.

నేను.. గోపాల్, అడ్డాల చంటి అందరం ‘అల్లరి రాముడు’ సినిమా షూటింగ్ కోసం పాలకొల్లులో ఉన్నాం. అప్పుడు చిన్న రామయ్య(తారక్) నా దగ్గరకి వచ్చి మీరు ఎన్టీ రామారావు గారికి ఎంతటి అభిమానో.. నేను మా బాబాయ్ కి కూడా పెద్ద ఫ్యాన్స్ అండి. మీరు ఎలా కాగితాలు చింపి విసిరేస్తారో నేను అలా విసిరేస్తాను.. అలా ఈలలు వేస్తానని చెప్పాడు. మరి నువ్వు ఈ విషయాన్ని బాబాయ్ కి ఎప్పుడు చెప్పలేదా..? అంటే ‘లేదండీ బాబాయ్ అంటే భయం.. ఎక్కువగా మాట్లాడను’ అన్నాడు. ఉండు మాట్లాడిస్తానని బాలయ్యకి ఫోన్ చేసి ముందు నేను బాలయ్యతో మాట్లాడి ఆ తరువాత తారక్ కి ఇచ్చాను. ఒక అభిమానిగా తారక్ వాళ్ల బాబాయ్ తో మాట్లాడిన సన్నివేశం పాలకొల్లు క్షీరారామంలో ప్రదేశంలో జరిగింది.ఆ తరువాత ఫంక్షన్ లో కూడా బాబాయ్, అబ్బాయికి కలిపి ఒకే దండ వేసినప్పుడు కూడా మేము అక్కడేఉన్నాం” అంటూ చెప్పుకొచ్చాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -