Sunday, May 12, 2024
- Advertisement -

ఊపిరి మూవీ రివ్యూ

- Advertisement -

ఒక సినిమా తరవాత ఒక సినిమా తో బ్యాక్ టూ బ్యాక్ సూపర్ హిట్ లు కొడుతున్న నాగార్జున హిట్ లతో సమానంగా క్రిటిక్ ల మన్ననలు కూడా పొందుతున్నాడు. మంచి సినిమాలు తీయడం తో పాటు ఇండస్ట్రీ కి పేరు తెచ్చే సినిమాలు అంటే నాగార్జునే అని ఫాన్స్ చెప్పుకునేలా ఆయన సినిమాలు ఉంటున్నాయి ఈ మధ్య కాలంలో.

ఎవడు తరవాత సినిమా తీయని వంశీ పైడిపల్లి ఇన్ టచ్ బుల్స్ అనే ఇంగ్లీష్ సినిమాని ప్రేరణ గా తీసుకుని ఇచ్చిన ఊపిరి కథ నాగార్జున కి నచ్చి తమిళ హీరో కార్తి తో ద్విభాషా చిత్రంగా తెరకి ఎక్కించారు పీవీపీ. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం 

స్టొరీ – పాజిటివ్ లు:

విక్రమాదిత్య(నాగార్జున)  కోట్లకి పడగలు ఎత్తిన సామంతుడు. జీవితం లో ఎంతో డబ్బుండి కూడా ఐదు సంవత్సరాల క్రితం పారా గ్లైడింగ్ లో జరిగిన యాక్సిడెంట్ కారణంగా మెడ నుంచి శరీరం కింద అంతా ఏమీ పని చెయ్యని రీతి అయిపోయిన మనిషి . తనకి సపర్యలు చేసేవాడు సేవ చేయాలనో, జాలి వలనో కాకుండా తనని ఒక వస్తువులా చూడాలి అని అనుకుంటూ ఉంటాడు. అదే సమయం లో జైలు నుంచి వచ్చిన కార్తి(శ్రీను) అనుకోకుండా నాగార్జున ని కలవడం అలాంటి వ్యక్తి కోసమే నాగార్జున ఎదురు చూస్తూ ఉండడం తో వెంటనే అప్పాయింట్ అయిపోతాడు శ్రీను.

దాంతో వారిద్దరి మధ్యనా క్లోజ్ రేలషన్ పెరుగుతూ ఉంటుంది. ఫామిలీ విషయాల్లో కూడా శ్రీను  కి హెల్ప్ చేసిన విక్రం  గతం గురించి తెలుసుకున్న శ్రీను తన బాస్ కోసం ఏం చేసాడు అనే వైపుగా ఈ కథ సాగుతుంది. నాగార్జున గతం ఏంటో, దానికి సంబంధించిన మధురానుభూతి ని శ్రీను ఎలా ఫినిష్ చేసాడు అనేది సస్పెన్స్ . పేరుకి ఇంగ్లిష్ చిత్రం నుంచి అడాప్ట్ అన్నారు కానీ చాలా సీన్ లు అచ్చం అలాగే ఉంటాయి. కానీ శ్రీను కి సంబంధించిన ఫామిలీ సెంటిమెంట్ ఎక్కువగా జొప్పించారు. ఫస్ట్ హాఫ్ లో పెయింటింగ్ కామెడీ, చెల్లి పెళ్లి సీన్ లు అదిరిపోయాయి.

సెకండ్ హాఫ్ లో చేజింగ్ సీన్ లూ, మదర్ సెంటిమెంట్ లు సినిమాకి హై లైట్ గా మారతాయి. ఆఖరి 20 నిమిషాలు పర్ఫెక్ట్ గా సాగుతుంది కథ . సినిమా ఆద్యంతం ఎక్కడ బోర్ కొట్టకుండా నడిచింది. నాగార్జున పెర్ఫార్మన్స్ ఎప్పటి లాగానే చాలా బాగుండగా, కార్తి సినిమా లో చాలా మటుకూ బాధ్యతా తీసుకున్నట్టు అనిపిస్తుంది. తమన్నా సూపర్ గా చేసింది. ప్రకాష్ రాజ్ ఎప్పటి లాగానే తన పరిధి లో అదరగొట్టాడు. 

 

నెగెటివ్ లు: 

సెకండ్ హాఫ్ లో సినిమా కాస్త స్లో అవడం బ్యాడ్ అని చెప్పచ్చు, పాటల యావరేజ్ గా ఉన్నాయి. వంశీ స్క్రీన్ ప్లే విషయం లో ఇంకాస్త జాగ్రత్త పడితే బాగుండేది. కామెడీ చాలా పర్ఫెక్ట్ గా వర్క్ అయ్యింది కానీ సెకండ్ హాఫ్ లో ఇంకా ఎక్కువ కామెడీ ఎక్స్ పెక్ట్ చేసే ప్రేక్షకులకి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి 

 

మొత్తంగా:

మనం , సోగ్గాడే చిన్ని నాయన లాంటి సూపర్ హిట్ ల తరవాత నాగార్జున అందించిన మరొక బ్లాక్ బస్టర్ ఈ సినిమా అవుతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు. హాట్రిక్ సూపర్ హిట్ గా నిలుస్తూ తెలుగు సినిమాలో కొత్త ఒరవడి ని ఈ సినిమాతో ఇస్తున్నారు నాగార్జున . తెలుగు లో కార్తి కి మంచి మార్కెట్ కూడా పెరుగుతుంది ఈ సినిమా తో. వంశీ డైరెక్షన్, కార్తి యాక్షన్ మొత్తం గా ఈ సబ్జెక్ట్ ఈ సినిమా ని సూపర్ హిట్ చేసి పారేసాయి. ఈ వారాంతం లో మీ ఇంట్లో వారితో తప్పక చూడాల్సిన చిత్రం ఇది. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -