బాలీవుడ్ దర్శకుడికి ఓకే చెప్పిన ప్రభాస్..

- Advertisement -

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుసగా నాలుగు సినిమాల్లో నటిస్తున్నారు. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధేశ్యామ్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రమే వచ్చింది. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే సందర్భంగా రాధే శ్యామ్ టీజర్ విడుదల చేస్తారని ప్రచారం జరుగుతోంది.

ఈ సినిమా కాకుండా ప్రస్తుతం ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, ఓమ్ రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే ( వర్కింగ్ టైటిల్) సినిమాలు చేస్తున్నాడు. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా రాధే శ్యామ్ టీజర్ తో పాటు.. ఈ మూడు సినిమాలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలయ్యే అవకాశం ఉంటుందని సమాచారం.

- Advertisement -

అయితే తాజాగా మరో సినిమాకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తో యాక్షన్ ఓరియెంటెడ్ సినిమా ను చేయనున్నట్లు తెలుస్తుంది. హీరో ప్రభాస్ ను కలసి దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ కథ చెప్పాడనీ అది బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనీ సమాచారం. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.

Also Read: బాబాయే కాదు.. పవన్ నాకు అంతకు మించి.. చరణ్ భావోద్వేగం..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -