Thursday, April 25, 2024
- Advertisement -

జ్యోతిక పై ఫిర్యాదు చేసిన ఉపాధ్యాయుల సంఘం

- Advertisement -

ఈ మధ్యనే నటిగా తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించిన ప్రముఖ నటి జ్యోతి కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలను తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈమె ‘రాక్షసి’ అనే సినిమాలో ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పాత్రలో నటించింది. అయితే ఈ సినిమాలో గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్న టీచర్లు పిల్లలకు పాఠాలు సరిగ్గా చెప్పకుండా కథలు పుస్తకాలు చదువుకుంటూ లేదా సెల్ఫోన్ లో మాట్లాడుకుంటూ కాలం గడుపుతున్నారు అన్నట్టు చూపించారు. అంతేకాకుండా గవర్నమెంట్ స్కూలులో టీచర్లు ఎక్కువ జీతాలు తీసుకుంటారని అయినప్పటికి స్టూడెంట్స్ పై దృష్టి పెట్టరని అందువల్లే విద్యార్థులు ఉన్నత చదువులు చదవలేక పోతున్నట్టుగా కొన్ని సన్నివేశాలు ఉంటాయి.

సినిమా కి వచ్చిన రెస్పాన్స్ పక్కనపెడితే ఇప్పుడు ఈ సినిమా వల్ల జ్యోతిక వివాదాల్లోకి రావలసి వచ్చింది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు నిజాయితీతో పనిచేసే కొందరు గవర్నమెంట్ టీచర్లను కించపరిచే విధంగా ఉన్నాయని తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. అంతేకాకుండా ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పీకే ఇళమారన్ చెన్నై పోలీస్ కమిషనర్ ఆఫీస్ లో ‘రాక్షసి’ సినిమా కి వ్యతిరేకంగా కంప్లైంట్ ఇచ్చారు. అందులో జ్యోతిక మరియు చిత్ర బృందం పై చర్యలు చేపట్టాలని కోరింన పీకే సినిమా కేవలం ఉపాధ్యాయుల వల్లనే దేశం నాశనం అయిపోతుంది అన్నట్లుగా చూపించారని అది ఉపాధ్యాయులను కించపరిచే విధంగా ఉందని పేర్కొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -