Wednesday, May 15, 2024
- Advertisement -

ప్రేమమ్ మూవీ రివ్యూ!

- Advertisement -

మణిరత్నం తీసిన ప్రేమ కావ్యాలు పక్కన పెడితే సౌత్ సినిమాలలోనే ప్రేమం అనే మలయాళం సినిమాని మించిన బేస్ లవ్ స్టోరీ లేదు అనే చెప్పాలి. ఏ బాష వారికి అయిన అర్ధమయ్యే ప్రేమ అనే భాషనీ నవీన్ పాళీ – సాయి పల్లవి లు తమదైన శైలి లో చూపించిన తీరుని ఎవ్వరూ మర్చిపోలేరు.

అలాంటి కథని తెలుగులో రీమేక్ చెయ్యాలి అనుకోవడం ఎంత పెద్ద సాహసం ? కానీ దాన్ని దిఘ్విజయంగా చేసాడు చందూ .. అతని కార్తికేయ సినిమాకి ఏ మాత్రం సంబంధం లేని ఒక లవ్ స్టోరీ ని ఎన్నుకుని పెద్ద ప్రయోగమే చేసాడు .

స్టోరీ – పాజిటివ్ లు :

నాగ చైతన్య – విక్రం చిన్న తనం నుంచీ సాగిన లవ్ స్టోరీల పరంపర  ఈ చిత్రం. స్కూల్ రోజులలో సుమ (అనుపమ పరమేశ్వరన్ ) ఘాడంగా ప్రేమిస్తాడు. ఆమె కూడా అతన్ని ప్రేమించినట్టే ప్రేమించి అనుకోకుండా హ్యాండ్ ఇస్తుంది. కొన్నాళ్ళ తరవాత కాలేజీ లో కనిపించే చైతన్య రెబెల్ గా ఉంటాడు. టీనేజ్ నుంచి ఫుల్లు గా పెరిగి కాలేజీ గొడవల్లో గ్యాంగ్ లీడర్ రేంజ్ లో మాస్ గా కనిపిస్తాడు. ఆ టైం లో పార్ట్ టైం లెక్చరర్ గా వచ్చిన ఒక అమ్మాయితో ( శ్రుతి హసన్) తో ప్రేమలో పడతాడు మనోడు. విక్రం కీ ఆమెకీ మధ్య ప్రేమ ఒక స్టేజీ కి రీచ్ అయిన క్రమం లో సమ్మర్ సెలవులకి ఇంటికి వెళ్ళిన ఆమె ఎప్పటికీ తిరిగ రాకపోవడం తో ఆమె గురించి , ఆమె అడ్రస్ గురించీ కనుక్కున్న హీరో కి భారీ షాక్ తగులుతుంది. ఇది తెరమీద చూడాల్సిందే. ఆ తరవాత సినిమా లో ఎలాంటి మలుపులు వచ్చాయి అనే దిశగా కథ సాగుతుంది. నాగ చైతన్య మూడు పాత్రలలో ఆదరగోట్టేసాడు అనే చెప్పాలి. అద్భుతమైన నటన తో , పరిపక్వత తో చేసాడు చైతూ. శ్రుతి కూడా పరవాలేదు అనిపించింది . అనుపమ , మడోన్నా బాగున్నారు. నాగార్జున, వెంకటేష్ ల స్పెషల్ అప్పియరెన్స్ కేక అని చెప్పాలి. థియేటర్ లు దద్దరిల్లే టైం అదే మరి. ఆఖర్లో వచ్చిన నాగార్జున సూపర్ సందేశం కూడా ఇచ్చారు. డైరెక్టర్ చందూ ముఖ్యంగా సినిమాలో కామెడీ, ఎంటర్టైన్మెంట్ మీద మనసు పెట్టడం తో ఈ సినిమా అటువైపుగా సాగుతుంది. ప్రవీణ్ – వివా హరిశా లాంటి వారి కామెడీ అదిరింది. ఇంటర్వెల్ బ్లాక్ బాగుంది. క్లిమాక్స్ లో కాస్త ఫీల్ తగ్గినా పరవాలేదు . పాటలు తెరమీద బాగున్నాయి .

నెగెటివ్ లు :

అందరూ అనుకున్నట్టు గానే శృతి హసన్ ఈ సినిమాకి నెగెటివ్ అయ్యింది. అయితే మలర్ క్యారెక్టర్ నీ, ప్రేమం సినిమానీ మర్చిపోయిన వారు గానీ తెలీని వారికి గానీ ఈమె క్యారెక్టర్ నచ్చితీరుతుంది. కామెడీ ఎక్కువగా పెట్టాడు గానీ చాలా చోట్ల తుస్సు మంది. మలయాళం ప్రేమం అందించే చాలా బ్లాక్ లు ఇక్కడ మిస్ అయ్యాడు డైరెక్టర్. కొన్ని కొన్ని చోట్ల ఫక్తు తెలుగు సినిమా కాబట్టి ఇలాగే ఉండాలి అన్నట్టు సీన్ లు సాగిపోయాయి. సెకండ్ హాఫ్ కాస్త స్లో గా నడుస్తుంది

మొత్తంగా :

మొత్తంగా మలయాళం ప్రేమం ని మైండ్ లో పెట్టుకుని వెళితే ఈ సినిమా ఖచ్చితంగా నచ్చదు. అందులో ఉన్న ఎమోషన్ ని ఇవ్వలేదు ఈ సినిమా. కానీ ఎంటర్టైన్మెంట్ పరంగా మంచి సక్సెస్ సాధించారు డైరెక్టర్ మరియూ అతని బృందం . మంచి మంచి సీన్ లు పడ్డ కాసేపటికే స్క్రీన్ ప్లే స్లో అయిపోవడం లాంటివి పెద్ద మైనస్ లు. ఏదేమైనా సీజన్ బట్టీ చూసుకుంటే ప్రేమం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలక్షన్ లాగుతుంది అనడం లో ఎలాంటి సందేహమూ లేదు. వెంకటెష్ కామియో కోసం , నాగ చైతన్య నటన కోసం ఈ సినిమా తప్పకుండా చూడాలి. మీ ఫామిలీ లతో ఈ వారంతం చూడదగ్గ సూపర్ సినిమా ఇదే.

రివ్యూ రేటింగ్: 3.75

{youtube}oZBwe3rw6iU{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -