మహేష్ బాబు హీరోగా నటించిన ‘ఖలేజా’, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘కొమరంపులి’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లు గా మారిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు విడుదలై ఇప్పటికే చాలా కాలం గడిచింది. కానీ తాజాగా ఈ సినిమాలు రెండు వార్తల్లోకి ఎక్కాయి. ఈ రెండు సినిమాల మధ్య కామన్ పాయింట్ ఏంటంటే వీటిని నిర్మించింది రమేష్ బాబు కాగా సి కళ్యాణ్ ఈ రెండు చిత్రాలకు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించారు. తాజాగా ప్రముఖ సినీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు షాలిమార్ హోమ్ ఎంటర్టైన్మెంట్ మరియు యూనివర్సల్ హోమ్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మాతలపై 2011లో కేసు పెట్టారు.
‘పులి’, ‘ఖలేజా’ సినిమాల రైట్స్ ఇవ్వకుండా భాను కిరణ్ అనే ఒక డాన్ సహాయంతో నిర్మాతలు వారిని బెదిరించారని వారు ఆరోపించారు. కానీ నిర్మాతలు మాత్రం షాలిమార్ మరియు యూనివర్సల్ వారు అనుకున్నట్టుగా ఒక్కో సినిమాకి 52.50 లక్షలు ఇవ్వకపోవడం వల్ల రైట్స్ ఇవ్వలేదని పేర్కొన్నారు. అంతేకాక మొదట 22.25 లక్షల కు గాను చెక్ ఇచ్చారని తరువాత 12.50 లక్షలు క్యాష్ రూపంలో ఇచ్చారని తెలిపారు. గత కొన్నాళ్లుగా కోర్టులో నడిచిన ఈ కేసులో ఆఖరిగా సరైన ఎవిడెన్స్ లేకపోవడం వల్ల రమేష్ బాబు, సి కళ్యాణ్ మరియు భాను కిరణ్ లకు క్లీన్ చిట్ ఇచ్చింది హై కోర్ట్.
